
ఖైదీలకు మెరుగైన వసతులు కల్పించాలి
నాగర్‌కర్నూల్ క్రైం: సబ్‌జైలులోని ఖైదీలకు మెరుగైన వసతులు కల్పించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నసీం సుల్తానా అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సబ్‌జైలును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జైలు పరిసరాలను పరిశీలించడంతో పాటు ఖైదీలకు అందించే ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. అనంతరం న్యాయమూర్తి మాట్లాడుతూ.. ఎంతో మంది క్షణికావేశంలో నేరాలకు పాల్పడి శిక్ష అనుభవిస్తున్నారని అన్నారు. ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. న్యాయవాదిని నియమించుకోలేని వారికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్ గుణశేఖర నాయుడు, న్యాయవాదులు మధుసూదన్‌రావు, పవనశేష సాయి పాల్గొన్నారు.
ఏటీసీలో అడ్మిషన్లు
మన్ననూర్: స్థానిక ఐటీఐ కళాశాలలో ఏర్పాటుచేసిన అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్‌లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని ప్రిన్సిపాల్ లక్ష్మణస్వామి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ ఆటో మిషన్, ఇండస్ట్రియల్ రోబొటిక్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆర్టిసన్ యూసింగ్ అడ్వాన్స్ టూల్స్ కోర్సులతో పాటు బేసిన్ డిజైనర్ అండ్ పర్చువల్ పెరీఫైర్, అడ్వాన్స్‌డ్ సీఎస్‌సీ మెషినింగ్ టెక్నీషియన్, మెకానిక్ ఎలక్ట్రానిక్స్ వెహికిల్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 31వ తేదీలోగా https://iti.tela ngana.gov.in వెబ్‌సైట్‌లో మొబైల్ నంబర్‌తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. అదే విధంగా ఐటీఐ కళాశాలలో మిగిలిన సీట్ల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. కోపా, డ్రాప్ట్‌మన్ సివిల్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ ట్రేడ్ కోర్సుల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. అర్హత, ఆసక్తిగల విద్యార్థులు ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. మరింత సమాచారం కోసం 85004 61013, 99517 07945, 85004 61022 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.
దరఖాస్తు చేసుకోండి
కందనూలు: షెడ్యూల్డ్ కులాల విద్యార్థులు విదేశీ విద్యాలయాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు గాను అందించే స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి రాంలాల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ దేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులు వచ్చే నెల 31వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ప్రణాళికా బద్ధంగా
చదివితేనే లక్ష్యసాధన
తెలకపల్లి: విద్యార్థులు ప్రణాళికా బద్ధంగా చదివితేనే నిర్దేశిత లక్ష్యాలు సాధ్యమవుతాయని డీఈఓ రమేశ్ కుమార్ అన్నారు. తెలకపల్లిలోని బీసీ గురుకుల పాఠశాలలో బుధవారం డీఈఓ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు పదో తరగతి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు.

ఖైదీలకు మెరుగైన వసతులు కల్పించాలి