
ఒత్తిళ్లకు తలొగ్గొదు..
జిల్లాలో వర్క్ అడ్జెస్ట్‌మెంట్ కోసం చేపడుతున్న ఉపాధ్యాయుల డిప్యూటేషన్ పారదర్శకంగా జరగాలి. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తావు ఇవ్వొద్దు. చాలా మంది ఉపాధ్యాయులు రాజకీయ నాయకులను, పలుకుబడిన సంఘాలను సంప్రదించి తనకు నచ్చిన దగ్గర పోస్టింగ్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ విద్యాశాఖ అధికారులు ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా పారదర్శకంగా జరగాలి.
– రాజిరెడ్డి, తపస్ జిల్లా అధ్యక్షుడు
పారదర్శకంగా నిర్వహిస్తాం
జిల్లాలో ఉపాధ్యాయులకు సంబంధించి వర్క్ అడ్జెస్ట్‌మెంట్ డిప్యూటేషన్‌పై ఇంకా కసరత్తు కొనసాగుతుంది. మండలాల నుంచి పూర్తి సమాచారం విద్యాశాఖ కార్యాలయానికి చేరలేదు. సమాచారం వచ్చిన తర్వాత ఎంతమందిని వర్క్ అడ్జెస్ట్‌మెంట్ చేయాలనేది పూర్తిగా తెలుస్తుంది. ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా పారదర్శకంగా నిర్వహిస్తాం. – రమేష్‌కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి, నాగర్‌కర్నూల్
●

ఒత్తిళ్లకు తలొగ్గొదు..