
బాలికల వసతి గృహం ఆకస్మిక తనిఖీ
కందనూలు: జిల్లాకేంద్రంలోని వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ కళాశాల బాలికల వసతి గృహాన్ని శనివారం రాత్రి కలెక్టర్ బదావత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినులతో మాట్లాడి భోజనం నాణ్యతను గురించి తెలుసుకున్నారు. హాస్టల్‌లో సౌకర్యాలు, ఎదురవుతున్న సమస్యలు, ఎంత మంది విద్యార్థులు ఉంటున్నారని ఆరాతీశారు. ఈ సందర్భంగా విద్యార్థినులు కలెక్టర్ దృష్టికి తెచ్చిన పలు సమస్యలపై ఆయన స్పందిస్తూ త్వరలోనే వాటన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థినులు బాగా చదువుకొని సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు.