హేమాచలుడికి పూజలు
మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయం ఆదివారం వేలాది మంది భక్తజనంతో కిక్కిరిసిపోయింది. రాష్ట్రంలోని సుదూర ప్రాంతాల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద స్నానాలు ఆచరించి ఆలయంలోని స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు నిర్వహించిన తిలతైలాభిషేకం పూజలో పాల్గొని స్వామివారిని నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు అర్చకులు స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని అందజేశారు. నిత్యాన్నదాన కార్యక్రమ నిర్వహణ ఖర్చులకు భక్తులు విరాళాలను అందజేశారు.
– మంగపేట


