ఉద్యోగులకు సన్మానం
ములుగు రూరల్: జిల్లా కేంద్రంలో 58వ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా మూడోరోజు గ్రంథాలయంలో వివిధ పుస్తకాలు చదివి ఉద్యోగాలు సాధించిన వారిని ఆదివారం సన్మానించారు. అనంతరం గ్రంథాలయానికి ఉద్యోగులు పుస్తకాలను డొనేట్ చేశారు. ఈ సందర్భంగా గ్రంథాలయ మెంబర్ షిప్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ పాలకులు సమ్మక్క, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.
దుక్కిటెద్దు మృతి..
ములుగు రూరల్: మండల పరిధిలోని పత్తిపల్లి గ్రామానికి చెందిన రైతు ఇనుముల శంకర్ దుక్కిటెద్దు అకస్మాతుగా ఆదివారం మృత్యువాత పడింది. దీంతో రైతు కన్నీటి పర్యంతం అయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. నిరుపేద కుటుంబానికి చెందిన రైతు శంకర్ ఎద్దుల సాయం వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఎద్దులను బండికి కట్టుకొని పొలానికి వెళ్లి పచ్చిగడ్డి మేపుకొని పశుగ్రాసాన్ని బండిలో వేసుకుని ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో బడికి కట్టిన ఎద్దు నడుస్తూనే ఒక్కసారిగా కుప్పకూలింది. శంకర్ వెంటనే బండి ఇప్పి పరిశీలించగా ఎద్దు మృతి చెంది ఉండడంతో కన్నీటి పర్యంతం అయ్యాడు. శంకర్ రోధించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. ఎద్దులపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న తనను ప్రభుత్వం ఆదుకుని ఆర్థిక సాయం అందించాలని వేడుకున్నారు.
చలి చంపేస్తోంది..
కాళేశ్వరం: వారం రోజులుగా గోదావరి తీర ప్రాంతాల్లో చలి పంజా విసురుతోంది. చలికి మనుషులతో పాటు ఏ జీవరాశి కూడా తట్టుకోవడం లేదు. పగటిపూట ఉష్ణోగ్రతలు తగ్గుతూ..రాత్రికి 13–14 డిగ్రీలకు చేరుతుంది. దీంతో మహదేవపూర్ మండలంలో నిర్మించిన అన్నారం(సరస్వతి బ్యారేజీ) వద్ద శనివారం రాత్రి చలికి వణికిపోతూ వానరాల గుంపు దర్శనమిచ్చింది. అడవిలో ఉండాల్సిన వానరాలు బ్యారేజీ వంతెనపై రాత్రిపూట చలికి గజగజ వణికిపోతూ తన పిల్లలను ఒడిలో హత్తుకుపెట్టుకొని బతుకు జీవుడా అంటూ ప్రయాణికులు కనిపించాయి. అయ్యో! మాకు కూడా చలేస్తుంది అన్నట్లుగా వానరాలు వణుకుతూ అటుగా వెళ్తున్న చూపరుల మనస్సు చలించుకుపోయేలా కనిపించాయి.
‘మహా లక్ష్మీ’ భళా!
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ఆదివారం మహిళా భక్తులు బారులుదీరారు. ఆర్టీసీ బస్సుల్లో భారీగా మహిళలు ‘మహాలక్ష్మీ’ పథకాన్ని వినియోగించుకుని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకున్నారు. దీంతో రాత్రి వరకు మహిళా భక్తులు బస్టాండ్‌లో బస్సుల్లో ఎక్కి కిక్కిరిసి ప్రయాణించారు.
ఉద్యోగులకు సన్మానం
ఉద్యోగులకు సన్మానం
ఉద్యోగులకు సన్మానం


