జిల్లా అభివృద్ధికి కృషి
● పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
ములుగు రూరల్: జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర,శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క తెలిపారు. జిల్లా కేంద్రంలోని గట్టమ్మ దేవాలయం వద్ద రూ.45లక్షలతో నిర్మించతలపెట్టిన బ్రిడ్జి నిర్మాణ పనులకు కలెక్టర్ దివాకర, గ్రంథాయల సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్‌తో కలిసి మంత్రి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ జిల్లాను సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. అందులో భాగంగానే అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు వివరించారు. జిల్లాలో వివిధ ప్రాంతాలకు వెళ్లే భక్తులు ముందుగా గట్టమ్మతల్లిని దర్శించుకున్న అనంతరమే ముందుకు సాగుతారని తెలిపారు. అందుకోసమే గట్టమ్మ తల్లి ఆలయం వద్ద అన్ని రకాల వసతులు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


