
Young Mantra Organization Entry Into Movie Production: డిజిటల్ సినిమా రంగంలో పదేళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం ఉన్న సంస్థ 'యంగ్ మంత్ర'. ఇప్పటి వరకు 500లకుపైగా చిత్రాలను ప్రమోట్ చేసిందీ సంస్థ. ప్రస్తుతం ఆ అనుభవమే పెట్టుబడిగా నిర్మాణరంగంలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే ప్రముఖ ఓటీటీ సంస్థలకు మూడు చిత్రాలను నిర్మిస్తుండగా, వాటితోపాటు త్వరలోనే నూతన నటీనటులతో ఒక చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. మంచి కంటెంట్, వారి డిజిటల్ ప్రమోషన్స్ అనుభవంతో నాణ్యమైన చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తామని 'యంగ్ మంత్ర' వ్యవస్థాపకుడు కటకం శ్రీకాంత్ తెలిపారు. డిజిటల్ ప్రమోషన్స్ తక్కువ ఖర్చుతో ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరడానికి ఎంతో ఉపయోగపడతాయన్నారు.
'టాలీవుడ్‌లో మొదటగా డిజిటల్ ప్రమోషన్స్ ప్రారంభించిన సంస్థల్లో యంగ్ మంత్ర ఒకటి. ఇప్పటివరకు 500లకుపైగా చిత్రాలకు ప్రమోషన్స్‌తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థలతో పనిచేశాం. ఎప్పటికప్పుడు టెక్నాలజీ పరంగా మరింత అప్‌డేట్ అవుతూ మరిన్ని ఎక్కువ సినిమాలను తక్కువ ఖర్చుతో ప్రమోట్ చేయడమే మా లక్ష్యం. త‍్వరలోనే మా సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను టాలీవుడ్‌లో ఐదుగురు ప్రముఖ నిర్మాతలు విడుదల చేయనున్నారు.' అని కటకం శ్రీకాంత్ పేర్కొన్నారు.