వాలీబాల్‌ నేపథ్యంలో ‘వాలీ’ | Volley Movie Title Poster Launched By Director Krish | Sakshi
Sakshi News home page

వాలీబాల్‌ నేపథ్యంలో ‘వాలీ’

Apr 19 2026 1:03 PM | Updated on Apr 19 2026 1:25 PM

Volley Movie Title Poster Launched By Director Krish

టాలీవుడ్‌లో మొట్టమొదటి వాలీబాల్ నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కుతుంది. జి విక్రమ్ రెడ్డి సమర్పణలో ఫైర్‌వాటర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి దిలీప్ కె. మనుకొండ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి వాలీ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. టైటిల్‌ పోస్టర్‌ని ప్రముఖ దర్శకుడు క్రిష్‌ ఎక్స్‌ వేదికగా విడుదల చేశాడు. ఈ చిత్రంతో రోనిత్ జీఆర్‌జీ హీరోగా పరిచయం అవుతున్నాడు. నిపుణ్‌ సత్య ముఖ్య పాత్రను పోషిస్తున్నాడు. 

అభిగ్న్య వుత్తలూరు హీరోయిన్‌గా నటిస్తోంది. చిత్రాన్ని జి రోహన్ రెడ్డి నిర్మిస్తుండగా, శ్రీనివాస్ కారంకి సహ నిర్మాతగా, స్నేహ దాసరి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.‘ఆంధ్రప్రదేశ్‌లోని ఉప్పాడ  పరిసర ప్రాంతాల్లో అందమైన లొకేషన్లలో చిత్రీకరణ పూర్తయ్యింది. ప్రస్తుతం  పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాం. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని అప్‌డేట్స్‌ ఇస్తాం’అని మేకర్స్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement