
విజయ రామరాజు ప్రధాన పాత్ర పోషించిన స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి' (Arjun Chakrabarty). విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించగా శ్రీని గుబ్బల నిర్మించారు. 46 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అందుకున్న ఈ సినిమా ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి రెస్పాన్స్ అందుకుంది. సినిమా సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ థాంక్యూ మీట్ నిర్వహించింది.
ఆరేళ్ల కష్టం..
ఈ సందర్భంగా డైరెక్టర్ విక్రాంత్ మాట్లాడుతూ.. సినిమా చూసిన ఆడియన్స్ అద్భుతంగా ఉందని చెబుతున్నారు. అయితే ఇంకా చాలామంది సినిమా చూడలేదు. ప్రేక్షకులు సినిమాని ఆదరించి కలెక్షన్స్ ఇవ్వగలిగితేనే ఇలాంటి మంచి సినిమాలు మీ ముందుకు వస్తాయి. హీరో విజయ్ ఆరేళ్లపాటు ఈ సినిమాకోసం పనిచేశారు. ఈ సినిమా కోసం హీరోయిన్ సిజా రోజ్ ప్రత్యేకంగా తెలుగు నేర్చుకుంది అని తెలిపాడు.
నా గుండెల్లో ఉంటారు
హీరో విజయరామరాజు మాట్లాడుతూ.. మాకు సపోర్ట్ చేసిన హనురాఘవపూడి గారికి, వెట్రిమారన్ గారికి, అడివి శేష్ గారికి, సంపత్ నంది గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సినిమాలో నేను ఏదైనా పెర్ఫార్మన్స్ చేశాను అంటే ఆ క్రెడిట్ అంతా మా డైరెక్టర్ గారికి దక్కుతుంది. మా నిర్మాత శ్రీని గారు లేకపోతే ఈ సినిమా వచ్చేది కాదు. ఆరేళ్లుగా ఆయన ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు. ఆయన జీవితాంతం నా గుండెల్లో ఉంటారు అని పేర్కొన్నాడు.