
డబ్బు పెద్ద జబ్బు మూవీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది తెలుగు నటి హరిత (Actress Haritha). ప్రెసిడెంట్‌గారి పెళ్లాం, చినరాయుడు, పేకాట పాపారావు, దొంగపోలీస్.. ఇలా అనేక సినిమాల్లో నటించింది. తర్వాత సీరియల్స్‌కు షిఫ్ట్ అయింది. దాదాపు 80 సీరియల్స్‌లో హీరోయిన్‌గా చేసిన ఆమె తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారింది. ముద్దమందారం సీరియల్‌తో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.
ఏడ్చేసిన హరిత
తాజాగా ఆమె తన పర్సనల్ లైఫ్, కెరీర్ విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. హరిత మాట్లాడుతూ.. మా అన్నయ్య, చెల్లి (హీరోయిన్ రవళి) వీళ్లే నా బెస్ట్‌ఫ్రెండ్స్. పెళ్లయ్యాక నా భర్త జాకీ, ఇప్పుడు నా కూతురు బెస్ట్‌ఫ్రెండ్ అయ్యారు. అయితే పగలూరాత్రి తేడా లేకుండా షూటింగ్స్‌లోనే మునిగిపోయేదాన్ని. దాంతో పిల్లలను చూసుకునేందుకు కొంతకాలంపాటు పనిమనుషులను పెట్టాను. కొన్నిసార్లయితే బాబును ఇంట్లోనే ఉంచి తాళం వేసి వెళ్లేదాన్ని అంటూ ఏడ్చేసింది.
నటుడి సలహా లెక్క చేయలేదు
సినిమా నుంచి సీరియల్స్‌వైపు ప్రయాణం గురించి మాట్లాడుతూ.. సింగన్న మూవీలో హీరోయిన్‌గా చేశా.. చీకటి సూర్యులు సినిమాలోనూ ప్రధాన పాత్ర పోషించా.. సీరియల్స్ ఆపేస్తే మంచి హీరోయిన్ అవుతావని ఆర్.నారాయణమూర్తి చెప్పారు. కానీ, నేనసలు పట్టించుకోలేదు.. సీరియల్ ఛాన్సులు వస్తూ ఉన్న కొద్దీ చేసుకుంటూ పోయాను. అలా బుల్లితెరపైనే సెటిలయ్యాను. తమిళంలోనే ఎక్కువ ప్రాజెక్టులు చేశా.. హీరోయిన్‌గా 80కి పైగా సీరియల్స్ చేశాను.
బాడీ షేమింగ్
నాకు బాబు పుట్టాక హైదరాబాద్‌కు షిఫ్టయ్యాను. చిన్నప్పటినుంచి నేను చబ్బీగానే ఉండేదాన్ని. మా అన్నయ్య నన్ను బండ అని పిలిచేవాడు. పాప పుట్టినప్పుడు చాలా బరువు పెరిగిపోయా.. 98 కిలోలకు చేరాను. నేను లావుగా ఉండటంతో చాలామంది బాడీ షేమింగ్ చేసేవారు. కొన్నిసార్లు బాధపడ్డాను. అప్పుడే డైటింగ్ మొదలుపెట్టాను. తిండికి కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న నేను 15 ఏళ్లుగా డైటింగ్ చేస్తూనే ఉన్నాను అని హరిత చెప్పుకొచ్చింది.
చదవండి: నన్ను తక్కువ చేసి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు: యశ్ తల్లిపై హీరోయిన్ ఫైర్