ప్రభాస్‌ వర్సెస్‌ సేతుపతి | Vijay Sethupathi To Play A Negative Role In Upcoming Prabhas Film | Sakshi
Sakshi News home page

ప్రభాస్‌ వర్సెస్‌ సేతుపతి

Jan 23 2021 5:50 AM | Updated on Jan 23 2021 5:50 AM

Vijay Sethupathi To Play A Negative Role In Upcoming Prabhas Film - Sakshi

ప్యాన్‌ ఇండియా సూపర్‌స్టార్‌ ప్రభాస్, తమిళ నటుడు విజయ్‌ సేతుపతి తలపడనున్నారా? అంటే అవునంటున్నాయి ఫిలింనగర్‌ వర్గాలు. ఇటీవల విడుదలైన విజయ్‌ ‘మాస్టర్‌’ సినిమాలో విలన్‌గా నటించారు సేతుపతి. ఈ సినిమాలో ఆయన పాత్రకు మంచి స్పందన లభించింది. తాజాగా ప్రభాస్‌ ‘సలార్‌’లోనూ సేతుపతి విలన్‌గా చేయబోతున్నారట. ‘కేజీయఫ్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా ముహూర్తం ఇటీవల జరిగింది. వచ్చే నెలలో చిత్రీకరణ ప్రారంభం కానుందని తెలిసింది. ముందు ప్రభాస్‌–సేతుపతి కాంబినేషన్‌ సన్నివేశాలు తెరకెక్కించనున్నారని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement