స్టార్ హీరో భార్యకు ప్రెగ్నెన్సీ.. విష్ చేసిన సమంత! | Sakshi
Sakshi News home page

Varun Dhawan: తండ్రి కాబోతున్న వరుణ్ ధావన్.. సమంత స్పెషల్ విషెస్!

Published Sun, Feb 18 2024 6:46 PM

Varun Dhawan Announces Natasha Dalal Baby Bump With Pregnancy - Sakshi

బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ బీటౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. గతేడాది బవాల్‌ చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. ఈ మూవీలో జాన్వీ కపూర్ జోడీగా కనిపించింది. డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజైన ఈ  సినిమాకు ప్రేక్షకుల నుంచి ఆదరణ దక్కించుకుంది. వరుణ్ ప్రస్తుతం స్ట్రీ-2 అనే హారర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అమర్ కౌశిక్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇదిలా ఉండగా వరుణ్ ధావన్‌ అభిమానులకు గుడ్‌ న్యూస్‌ చెప్పారు. త్వరలోనే తాను తండ్రి కాబోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తన భార్య బేబీ బంప్‌తో ఉన్న ఫోటోను షేర్ చేశారు. మేము తల్లిదండ్రులం కాబోతున్నాం.. మీ అందరి ప్రేమ, ఆశీస్సులు కావాలంటూ రాసుకొచ్చారు.  

కాగా.. ఫ్యాషన్‌ డిజైనర్‌ నటాషా దలాల్‌ను 2021లో ప్రేమ వివాహం చేసుకున్నారు. సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న సినీ తారలు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. సమంత, కరణ్ జోహార్, జాన్వీ కపూర్, మౌని రాయ్, వాణి కపూర్, భూమి పెడ్నేకర్, అర్జున్ కపూర్, మలైకా అరోరా, రాశి ఖన్నా, మానుషి చిల్లర్, మనీష్ పాల్ కాబోయే తల్లిదండ్రులను అభినందించారు. వరుణ్ ధావన్ ప్రస్తుతం అట్లీ తెరకెక్కిస్తోన్న బేబీ జాన్ చిత్రంలో కనిపించనున్నారు. మరోవైపు సిటాడెల్ ఇండియన్ వెర్షన్‌లో సమంతతో కలిసి నటిస్తున్నారు. ఈ సిరీస్‌కు రాజ్,డీకే దర్శకత్వం వహించనున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement