రీఎంట్రీ ఇస్తున్న వడ్డే నవీన్‌.. ఖాకీ చొక్కాలో లాఠీతో.. | Vadde Naveen Re Entry with Trimurthulu, First Look Poster Released | Sakshi
Sakshi News home page

Vadde Naveen: రీఎంట్రీ ఇస్తున్న వడ్డే నవీన్‌.. టైటిల్‌ ఇదే!

Aug 9 2025 6:27 PM | Updated on Aug 9 2025 7:10 PM

Vadde Naveen Re Entry with Trimurthulu, First Look Poster Released

ఒకప్పటి హీరో వడ్డే నవీన్‌ (Vadde Naveen) వెండితెరపై కనిపించి చాలాకాలమే అవుతోంది. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత అతడు బిగ్‌స్క్రీన్‌పై రీఎంట్రీ ఇస్తున్నాడు. వడ్డే క్రియేషన్స్‌ అంటూ ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. తన బ్యానర్‌లోనే హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు.

త్రిమూర్తులు
ఈ చిత్రానికి త్రిమూర్తులు అని టైటిల్‌ ఫిక్స్‌ చేశాడు. ఆగస్టు 9 రాఖీ పండగ సందర్భంగా త్రిమూర్తులు నుంచి ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. ఇందులో వడ్డే నవీన్‌ ఖాకీ చొక్కా ధరించి, లాఠీ పట్టుకుని సీరియస్‌గా కాకుండా సరదాగా నవ్వుతూ కనిపిస్తున్నాడు. రాశీ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. కమల్‌ తేజ నార్ల దర్శకత్వం వహిస్తున్నాడు.

అప్పట్లో సెన్సేషన్‌
ప్రముఖ నిర్మాత వడ్డే రమేశ్‌ కుమారుడిగా నవీన్‌ తెలుగు తెరకు పరిచయమయ్యాడు. కోరుకున్న ప్రియుడు సినిమాతో కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. రెండో సినిమా పెళ్లితో నవీన్‌కు పెద్ద హిట్‌ పడింది. మనసిచ్చి చూడు, స్నేహితులు, చెప్పాలని ఉంది, చాలా బాగుంది, మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది వంటి పలు చిత్రాల్లో నటించాడు. వడ్డే నవీన్‌.. చివరగా 2016లో ఎటాక్‌ చిత్రంలో కనిపించాడు.

 

 

చదవండి: నాన్న చీపురు, చెప్పులతో కొట్టేవాడు.. కారంపొడి చల్లేవాడు:నటి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement