హీరోయిన్‌గా ఆఫర్ ఇస్తా.. కానీ రూమ్‌కు రావాల్సిందే: బుల్లితెర నటి జీవిత

TV Actress Jeevitha Opened About Harassmen In Tamil Cinema Career - Sakshi

సినీ ఇండస్ట్రీలో ఎదగాలంటే అంతా ఈజీ కాదు. ఎన్నో అవకాశాలు తలుపుతట్టినా కూడా అదృష్టం కలిసి రావాలి. సినీ రంగుల ప్రపంచం అంటేనే సవాళ్లతో కూడుకున్నది. సినీ ఇండస్ట్రీ కెరీర్ ప్రారంభంలో పలువురు స్టార్ హీరోయిన్లు సైతం వేధింపులకు గురైనవారే. తాజాగా ఈ జాబితాలో ఓ బుల్లితెర నటి చేరింది. కడైకుట్టి సింగం తమిళ సీరియల్ ఫేమ్ జీవిత తన కెరీర్‌లో ఎదురైన చేదు అనుభవాలను వెల్లడించింది. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో ఆమెకు ఎదురైన సంఘటనపై నోరు విప్పింది. ఆ సంఘటన తర్వాత జీవితంపై విరక్తి కలిగిందని చెబుతోంది. 

(ఇది చదవండి: అలా చేస్తేనే హీరోయిన్‌ ఛాన్సులిస్తామన్నారు: నటి)

ఓ ఇంటర్వ్యూలో జీవిత మాట్లాడుతూ..' ఒక దర్శకుడు తనకు ఒక సినిమాలో హీరోయిన్ పాత్ర ఆఫర్ చేశాడు. అధిక రెమ్యూనరేషన్, మరిన్ని సినిమా అవకాశాల ఇస్తానని చెప్పాడు. అయితే వాటి కోసం సర్దుకు పోవాలని కోరాడు. నాకు అప్పట్లో సినిమా ఇండస్ట్రీ కొత్త. కెమెరామెన్, నిర్మాత, మేనేజర్‌తో సర్దుకుపోవాలన్నారు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు గదికి రావాలి అన్నారు. దీంతో దర్శకుడి మాటలకు షాక్ తిన్నా. ఆ సమయంలో నాకు ఏడుపొచ్చేసింది. దర్శకుడి మాటలకు అవమానంగా ఫీలయ్యా. దీంతో అక్కడి నుంచి ఏం మాట్లాడకుండా వచ్చేశా.' అని అన్నారు. ఇటీవలే సినీ పరిశ్రమలో క్యాస్టింగ్‌ కౌచ్‌పై నటి వరలక్ష్మి శరత్‌కుమార్, ఖుష్బూ కూడా నోరు విప్పారు. తాము కూడా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నామని తెలిపారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top