Lucifer Update: Trisha Replace With Nayantara In Chiranjeevi Next - Sakshi
Sakshi News home page

Lucifer‌: మరో ఇంట్రస్టింగ్‌ అప్‌డేట్‌

Feb 22 2021 10:42 AM | Updated on Feb 22 2021 1:40 PM

Trisha replaces Nayanthara in Megastar Chiranjeevi Lucifer remake - Sakshi

సాక్షి,  హైదరాబాద్‌ : మెగాస్టార్ చిరంజీవి అప్‌కమింగ్‌ మూవీ ‘లూసిఫర్’కి సంబంధించి మరో ఇంట్రస్టింగ్‌ అప్‌డేట్‌ వెలుగులోకి వచ్చింది. మలయాళ సూపర్‌ హిట్‌మూవీ లూసిఫర్ రీమేక్‌లో పాత్రకుగాను సీనియర్ నటి త్రిష సంతకం చేసినట్టు తెలుస్తోంది. స్టార్‌ హీరోయిన్‌ నయనతార ఈ ప్రాజెక్ట్‌లో భాగం కాకూడదని నిర్ణయించుకుందట. నయన వెనకడుగు వేసిన నేపథ్యంలోనే త్రిష గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిందనేది తాజా సమాచారం.  

మెగాస్టార్‌ సూపర్‌ హిట్‌ స్టాలిన్ సినిమాలో జోడీగా నటించిన త్రిష, కథ నచ్చడంతో లూసిఫర్‌లో నటించేందుకు సంతకం చేసిందట. దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో రాబోతున్న ఈ  క్రేజీ మూవీ వచ్చే నెలలో సెట్స్‌ మీదికి రానుంది. అలాగే కీలకమై హీరో అనుచరుడి పాత్రలో హీరో సత్యదేవ్ అలరించనున్నాడు. ఈ మూవీలో నయనతార నటించనుందని గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే చెల్లి పాత్రలు చేసేందుకు సిద్ధంగా లేని నయనతార కథ నచ్చినా లూసిఫర్ రీమేక్‌కు నో చెప్పిందట. తాజాగా ఈ పాత్రకు త్రిష​ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. కాగా చిరంజీవి రాబోయే చిత్రం ఆచార్య మూవీలో లీడ్‌ రోల్‌ పోషించాల్సిన  త్రిష  అనూహ్యంగా వైదొలిగి,  లూసిఫర్‌కు అంగీకరించడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement