'ఓజీ' సినిమాకు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ | Telangana High Court Suspends OG Movie Ticket Hike | Sakshi
Sakshi News home page

OG Movie: పవన్ సినిమా రిలీజ్.. షాకిచ్చిన హైకోర్ట్

Sep 24 2025 3:19 PM | Updated on Sep 24 2025 4:22 PM

Telangana High Court Suspends OG Movie Ticket Hike

పవన్ కల్యాణ్ 'ఓజీ' సినిమాకు తెలంగాణ హైకోర్ట్ షాకిచ్చింది. పెంచిన ధరల్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బెనిఫిట్ షో, టికెట్ రేట్ల పెంపు మెమోని సస్పెండ్ చేసింది. ఈ మేరకు జస్టిస్ ఎన్.వి శ్రవణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇకపోతే ముందు రోజు అనగా 24న రాత్రి వేసే ప్రీమియర్‌కు తెలంగాణలో రూ.800 టికెట్‌ ధర(జీఎస్టీతో కలిపి) నిర్ణయించారు. విడుదల రోజు (ఈ నెల 25) నుంచి అక్టోబరు 4వ తేదీ వరకు సింగిల్‌ స్క్రీన్స్‌లో రూ.100 (జీఎస్టీతో కలిపి), మల్టీప్లెక్స్‌ల్లో రూ.150 (జీఎస్టీతో కలిపి) పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. ఇప్పుడు న్యాయస్థానం ఆదేశాలతో వాటిని తగ్గించాల్సి ఉంటుంది.

'హరిహర వీరమల్లు' లాంటి డిజాస్టర్ తర్వాత పవన్ నుంచి వస్తున్న సినిమా ఇది. గ్యాంగ్ స్టర్ డ్రామాగా దీన్ని తెరకెక్కించారు. ప్రియాంక మోహన్ హీరోయిన్ కాగా.. ఇమ్రాన్ హష్మీ విలన్. తమన్ సంగీతమందించాడు. సుజీత్ దర్శకుడు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మించారు.

OG మూవీకి తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement