Tejaswi Madivada: తాగొచ్చి అటాక్‌ చేశారు, ఇంటికెళ్లి తెగ ఏడ్చాను

Tejaswi Madivada About Commitments In the Industry - Sakshi

బిగ్‌బాస్‌ బ్యూటీ తేజస్వి మదివాడ హీరోయిన్‌గా నటించిన చిత్రం కమిట్‌మెంట్‌. తేజస్వితో పాటు అన్వేషి జైన్‌, సీమర్‌ సింగ్‌, తనిష్క్‌ రాజన్‌, అమిత్‌ తివారి, సూర్య శ్రీనివాస్‌, అభయ్‌ సింహా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు. లక్ష్మీ కాంత్‌ చెన్న దర్శకత్వం వహించిన ఈ మూవీ శుక్రవారం (ఆగస్టు 19న) రిలీజైంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్‌లో తేజు తను ఎదుర్కొన్న చేదు సంఘటనలను వెల్లడించింది.

'ఓసారి ఈవెంట్‌కు వెళ్లినప్పుడు సుమారు 30 మంది ఫుల్‌గా తాగొచ్చి రాత్రి నన్ను అటాక్‌ చేశారు. నేను ఏదోలా తప్పించుకుని ఇంటికి వెళ్లి తెగ ఏడ్చాను. అలాగే ఇండస్ట్రీలో చాలామంది నన్ను కమిట్‌మెంట్‌ అడిగారు. కొందరు ఫోన్‌లో అడిగారు, మరికొందరి నేరుగా చూపులతోనే అడిగేవారు. అది ఈజీగా తెలిసిపోయేది. సినీ ఇండస్ట్రీ అనే కాదు, ప్రతి రంగంలోనూ క్యాస్టింగ్‌ కౌచ్‌ ఉంది. కాకపోతే అప్పుడు సోషల్‌ మీడియా లేదు. అదే ఇప్పుడు ఏదైనా జరిగితే పేరుతో సహా సోషల్‌ మీడియాలో అన్నీ బయటపెట్టొచ్చు' అని తేజస్వి చెప్పుకొచ్చింది.

చదవండి: మొన్నే కదా బిడ్డ పుట్టింది, అప్పుడే మళ్లీ ప్రెగ్నెంటా?
స్టార్‌ హీరోల సినిమాలను వెనక్కునెట్టిన నిఖిల్‌ మూవీ

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top