ఆ విషయంలో కేంద్రం నిర్ణయం సరైంది కాదు: సూర్య

Suriya Opposes Centres Plans To Amend Cinematograph Act - Sakshi

సినిమాటోగ్రఫీ చట్ట సవరణపై అసంతృపి : సూర్య

సాక్షి, చెన్నై: ప్రజలను రక్షించడం కోసం చట్టం ఉండాలి గాని వారి గొంతు నొక్కడం కోసం కాదని నటుడు సూర్య అన్నారు. సినిమాటోగ్రఫీ చట్టం–1952ను సవరిస్తూ కేంద్రం తీసుకున్ననిర్ణయంపై సూర్య అసంతృప్తి వ్యక్తం చేశారు. సెన్సార్‌ సర్టిఫికెట్‌ పొందిన చిత్రాన్ని కూడా ప్రేక్షకులు వ్యతిరేకిస్తే ఆ చిత్రాన్ని తిరిగి సెన్సార్‌ చేయడం, ప్రదర్శన నిలిపివేయడం సరికాదన్నారు. కాగా ఈ చట్టాన్ని బాలీవుడ్‌ నుంచి కోలీవుడ్‌ వరకు పలువురు సినీ ప్రముఖులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

ప్రముఖ నటుడు, మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్, సీనియర్‌ దర్శకుడు భారతీరాజా, అమీర్, నటుడు సూర్య, విశాల్, కార్తీక్‌ వంటి ప్రముఖులు కేంద్ర ప్రభుత్వం సవరించిన కొత్త చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నటుడు విశాల్‌ మాట్లాడుతూ.. సెన్సార్‌ అయిన చిత్రాలను కూడా నిర్వహిస్తే సెన్సార్‌ బోర్డు ఎందుకని ప్రశ్నించారు. అదే విధంగా జీఎస్టీ, పైరసీని అరికట్టడం వంటి విషయాల గురించి స్పందించకపోవడం పైనా ప్రశ్నించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top