‘ఓయ్ ఇడియట్‌’ పెద్ద విజయం సాధించాలి: సుకుమార్‌ | Sukumar Talk About Oye Idiot Movie | Sakshi
Sakshi News home page

‘ఓయ్ ఇడియట్‌’ పెద్ద విజయం సాధించాలి: సుకుమార్‌

Nov 6 2022 3:30 PM | Updated on Nov 6 2022 3:30 PM

Sukumar Talk About Oye Idiot Movie - Sakshi

సహస్ర మూవీస్, మరియు హ్యాపీ లివింగ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై నిర్మాతలు సత్తిబాబు బాబు మోటూరి & శ్రీనుబాబు పుల్లేటి నిర్మిస్తున్న చిత్రం ఓయ్ ఇడియట్. యశ్వంత్ యజ్జవరుపు, త్రిప్తి శంక్ధర్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంతో యువ దర్శకుడు వెంకట్ కడలి దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో థియేటర్స్ లో విడుదల కానుంది. 

ఈ సందర్భంగా డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ… యంగ్ టీమ్ కలసి చేసిన ఓయ్ ఇడియట్ ట్రైలర్ ఫ్రెష్ గా ఉంది. టీనేజ్ లవ్ స్టోరీని స్క్రీన్ మీద అందంగా చూపించారు. ఇండస్ట్రీకి ఇలాంటి కొత్త నటీనటులు టెక్నీషియన్స్ ఎందరో రావాలి. ఓయ్ ఇడియట్ పెద్ద విజయం సాధించి అందరికి మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను’ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement