Actor Dhanush Invests Shocking Amount For His New Dream House, Deets Inside - Sakshi
Sakshi News home page

Dhanush: కొత్తింటి కోసం భారీగా ఖర్చు చేస్తున్న ధనుష్‌

Feb 23 2022 2:40 PM | Updated on Feb 23 2022 3:37 PM

Star Hero Dhanush Invests Rs 300 Crores For His New Dream Home - Sakshi

చెన్నైలో ధనుష్‌ విలాసవంతమైన ఇంటి నిర్మాణం చేపడుతున్నాడట! దీనికోసం అతడు ఏకంగా రూ.300 కోట్లు ఖర్చు చేస్తున్నాడట! ధనుష్‌ ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.50 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడు..

స్టార్‌ హీరో ధనుష్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కేవలం తమిళనాటనే కాదు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి పాపులారిటీ ఉంది. తెలుగులో తనకున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని మొట్టమొదటిసారిగా డైరెక్ట్‌ తెలుగు ఫిలిం చేస్తున్నాడీ హీరో. టాప్‌ డైరెక్టర్‌ వెంకీ అట్లూరితో సార్‌ సినిమా చేస్తున్నాడు. అటు తమిళ, హిందీలోనూ పలు ప్రాజెక్టులు క్యూలో ఉన్నాయి.

ఇటీవలే భార్య ఐశ్వర్య రజనీకాంత్‌కు విడాకులు ఇచ్చి వార్తల్లో నిలిచాడు ధనుష్‌. అప్పటినుంచి అతడు హోటల్‌లోనే బస చేస్తున్నట్లు వార్తలు రాగా తాజాగా మరో ఆసక్తికర విషయం నెట్టింట చక్కర్లు కొడుతోంది. చెన్నైలో ధనుష్‌ విలాసవంతమైన ఇంటి నిర్మాణం చేపడుతున్నాడట! దీనికోసం అతడు ఏకంగా రూ.300 కోట్లు ఖర్చు చేస్తున్నాడట! ఇదే నిజమైతే 300 కోట్ల రూపాయల విలువ చేసే ఇల్లు సొంతం చేసుకున్న ఏకైక సౌత్‌ హీరోగా ధనుష్‌ రికార్డు సృష్టించడం ఖాయం.

కాగా ధనుష్‌ ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.50 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడు. ఇక తెలుగులో శేఖర్‌ కమ్ముల, వెంకీ అట్లూరితో చేస్తున్న రెండు సినిమాలకు కలిపి మొత్తంగా రూ.100 కోట్లు వెనకేసినట్లు తెలుస్తోంది. ఈ డబ్బునంతా కూడా తన లగ్జరీ ఇంటి కోసమే ఖర్చు చేస్తున్నట్లు సమాచారం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement