రాజమౌళి దంపతులకు ఆస్కార్‌ నుంచి ఆహ్వానం.. | SS Rajamouli, Prem Rakshit And Other Indians Invited To Join The Academy, Post Goes Viral | Sakshi
Sakshi News home page

The Academy 2024 Members: ఆర్‌ఆర్‌ఆర్‌ డైరెక్టర్‌, కొరియోగ్రాఫర్లకు ఆస్కార్‌ నుంచి పిలుపు..

Jun 26 2024 1:29 PM | Updated on Jun 26 2024 2:07 PM

SS Rajamouli, Prem Rakshit and Other Indians Invited to join The Academy

ఆస్కార్‌.. ఎంతోమంది కలలు గనే ఈ అవార్డు గతేడాది ఇండియన్‌ సినిమాను వరించింది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీలో నాటు నాటు పాటకు ఉత్తమ ఒరిజినల్‌ విభాగంలో అకాడమీ పురస్కారం లభించింది. అంతేగాక ఈ సినిమా టీమ్‌ సభ్యులైన జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌, కీరవాణి, చంద్రబోస్‌, సెంథిల్‌, సాబు శిరిల్‌ గతేడాది అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌ (ఏమ్‌పీఏఎస్‌) లో సభ్యత్వం సాధించారు.

ఇప్పుడు ఆ జాబితాలో రాజమౌళి దంపతులు చేరారు. దర్శకత్వ కేటగిరీలో జక్కన్న, కాస్ట్యూమ్‌ డిజైనర్‌ లిస్టులో ఆయన భార్య రమా రాజమౌళి అకాడమీలో చేరేందుకు ఆహ్వానం అందుకున్నారు. ఈ ఏడాది అకాడమీ.. 57 దేశాల నుంచి 487 మంది సభ్యులకు ఆహ్వానం పంపింది. 

వీరిలో భారత్‌ నుంచి రాజమౌళి దంపతులతో పాటు కొరియోగ్రాఫర్‌ ప్రేమ్‌ రక్షిత్‌, బాలీవుడ్‌ నటి షబానా అజ్మీ, సినిమాటోగ్రాఫర్‌ రవి వర్మ, దర్శకనిర్మాత రీమా దాస్‌, నిర్మాత రితేశ్‌ సిద్వానీ తదితరులు ఉన్నారు. సినిమాల విషయానికొస్తే.. రాజమౌళి ప్రస్తుతం మహేశ్‌బాబుతో ఓ సినిమా(#SSMB29) చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభించనున్నారు.

 

 

చదవండి: ప్రియుడితో పెళ్లి.. ట్రోలర్స్‌కు కౌంటరిచ్చిన హీరోయిన్‌!

Advertisement
 
Advertisement
Advertisement