నేను డైలాగ్స్ మింగేయడమే బెటర్.. లేదంటే | Sree Vishnu Reacts On His Censor Dilogues | Sakshi
Sakshi News home page

Sree Vishnu: అలా చెప్పినా డబుల్ మీనింగ్ అనుకుంటున్నారు

Apr 28 2025 5:32 PM | Updated on Apr 28 2025 6:33 PM

Sree Vishnu Reacts On His Censor Dilogues

శ్రీ విష్ణు అనగానే మంచి హీరో, ప్రయోగాత్మక, ఫన్ ఎంటర్ టైనర్ సినిమాలు చేస్తుంటాడు కదా అనే పేరుంది. అదే టైంలో సోషల్ మీడియాలో కుర్రాళ్లని అడిగితే శ్రీ విష్ణు.. ఎంత బాగా సెన్సార్ బోర్డ్ నుంచి తప్పించుకుంటాడనేది చెబుతారు. ఇ‍ప్పుడు దాని గురించే మీడియా అడగ్గా.. శ్రీ విష్ణు ఆసక్తికర సమాధానమిచ్చాడు.

శ్రీ విష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ '#సింగిల్'. తాజాగా ట్రైలర్ లాంచ్ జరిగింది. గతంలో ఇతడు నటించిన బ్రోచెవారెవరురా, సామజవరగమన, ఓం భీమ్ బుష్ చిత్రాల్లో కొన్ని బూతులా అనిపించే డైలాగ్స్ ఉన్నాయి. కానీ వాటిని శ్రీ విష్ణు చెప్పిన విధానం వల్ల అవి అలాంటివి అని సందేహం రాదు.

(ఇదీ చదవండి: ఏపీలో సమంత టెంపుల్.. ఇప్పుడు మరో విగ్రహం)    

తాజాగా రిలీజైన '#సింగిల్' ట్రైలర్ చివర్లోనూ ఓ డైలాగ్ ఉంటుంది. అది కూడా బూతులానే అనిపిస్తుంది కానీ కాదు. ఇప్పుడు ఈ తరహా డైలాగ్స్ గురించి శ్రీ విష్ణుని మీడియా అడగ్గా.. నేను డైలాగ్స్ మింగేయడమే బెటర్, లేదంటే సంస్కృతం డైలాగ్స్ చెప్పినా డబుల్ మీనింగ్ అనుకుంటున్నారు అని చెప్పుకొచ్చాడు.

తాను మాట్లాడేవి డబుల్ మీనింగ్ బూతులు కాదని, అది సంస్కృతం అని, మీకు ఉన్న ఫలంగా సంస్కృతం నేర్పించలేనని తనదైన శైలిలో కామెడీగా శ్రీ విష్ణు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఈ మూవీ మే 9న థియేటర్లలో రిలీజ్ కానుంది.

(ఇదీ చదవండి: మరో పాపని దత్తత తీసుకున్న శ్రీలీల?)    

Advertisement
 
Advertisement
Advertisement