'సౌండ్‌ ఆఫ్‌ సలార్‌'.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న వీడియో | Sakshi
Sakshi News home page

'సౌండ్‌ ఆఫ్‌ సలార్‌'.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న వీడియో

Published Sat, Dec 23 2023 12:43 PM

Sound of Salaar Background Score Video Released - Sakshi

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన ప్రభాస్‌ 'సలార్‌' సినిమా గురించే చర్చ నడుస్తోంది. పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ప్రధాన పాత్రల్లో దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన చిత్రం 'సలార్‌'. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసిన ఈ చిత్రం సూపర్‌ హిట్‌ టాక్‌తో దూసుకుపోతుంది.

ఈ సినిమాలోని పాటలు ఉండేది తక్కువే అయినా బీజీఎం ప్రధాన బలంగా పనిచేసింది. సినిమా విడుదలకు ముందురోజు ఒక పాటను విడుదల చేశారు. 'ప్రతి గాథలో రాక్షసుడే హింసలు పెడతాడు. అణచగనే పుడతాడు రాజే ఒకడు.. శత్రువునే కడ తేర్చే పనిలో మన రాజు.. హింసలనే మరిగాడు.. మంచిని మరిచే...' అంటూ వచ్చిన ఈ సాంగ్‌ చాలా హిట్‌ అయింది.

ఈ సినిమాకు ప్రధాన బలమైన బీజీఎంను తాజాగా చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేసింది.   ఈ సినిమాకు వస్తున్న భారీ రెస్పాన్స్‌ పట్ల సలార్‌ టీమ్‌ కూడా ఆనందపడుతుంది.
ఈ సందర్భంగా  మూవీ మేకర్స్‌ తాజాగా 'సౌండ్‌ ఆఫ్‌ సలార్‌' పేరుతో వీడియోను విడుదల చేసింది.  రవి బస్రూర్‌ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ అద్భుతమైన సౌండ్‌ ట్రాక్‌కు ఇప్పటికే లక్షల్లో వ్యూస్‌ వచ్చాయి. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ దీనిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు.

Advertisement
Advertisement