Sonu Sood: సోనూసూద్ ఇంటి వద్దకు భారీగా చేరుకున్న ఫ్యాన్స్‌.. ఇద్దరి ప్రాణాలు కాపాడిన సోనూ

Sonu Sood Celebrate Diwali With Fans - Sakshi

బాలీవుడ్ నటుడు, నిర్మాత సోనూసూద్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. సినిమాల కంటే సామాజిక కార్యక్రమాల విషయంలోనే ఆయనకు ఎక్కువ గుర్తింపు వచ్చింది.  ఆయన ఈసారి దీపావళిని కూడా ప్రత్యేకంగా జరుపుకున్నారు. స్క్రీన్‌పైనే విలన్‌ అయినప్పటికీ నిజజీవితంలో మాత్రం హీరోగా వెలుగుతూ ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఈ నటుడు తన అభిమానులతో కలిసి దీపావళీ పండుగను జరుపుకున్నాడు. సోనూసూద్‌కు దీపావళి శుభాకాంక్షలు తెలిపేందుకు ముంబైలోని ఆయన ఇంటి ముందు అభిమానులు భారీగా గుమిగూడారు.

వారిని చూసిని ఆయన ఇంట్లో నుంచి బయటకు వచ్చి అందరిని ఎంతో ఆత్మీయంగా పలకరించారు. ఈ ఏడాది దీపావళిని అభిమానులతో కలిసి ఆటోగ్రాఫ్‌లు ఇచ్చి సెల్ఫీలకు పోజులిచ్చి సంబరాలు చేసుకున్నాడు. అనంతరం ఆయన మీడియాతో స్పందిస్తూ.. 'దీపావళిని ఇలా కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకుంటున్నట్లు భావిస్తున్నాను. వారి ప్రార్థనలతోనే నేను ఇక్కడ నిలబడి ఉన్నా. పండుగ రోజు ఏదైనా పార్టీకి వెళ్లి సరదాగా ఉండటం కంటే.. ఇలా వారితో గడపడం మనసుకు హత్తుకునేలా ఉంది. అని ఆయన అన్నారు. అనంతరం అక్కడికి వచ్చిన అందరికీ స్వీట్స్‌ గిఫ్ట్‌ ప్యాక్స్‌ ఇచ్చారు.

కొందరికి పేద విద్యార్థులకు ట్యాబ్స్‌ కూడా ఇచ్చారు. చాలా మంది అభిమానులు వారికున్న ఇబ్బందులు తెలుపుతూ సాయం చేయాలని ఒక అర్జీ పత్రాన్ని సోనూసూద్‌కు ఇచ్చారు. అవన్నీ స్వీకరించిన సోనూ త్వరలో కాల్‌ చేస్తామని తెలిపారు. దీంతో వారంతో ఆయనతో సంతోషంగా దీపావళి సెలబ్రేషన్స్‌ చేసుకున్నారు.

రియల్ లైఫ్ హీరో సోనూ సూద్
కరోనా సమయంలో దేశంలోని చాలా మందికి వివిధ మార్గాల్లో సహాయం చేయడం ద్వారా సోనూ సూద్ నిజ జీవితంలో కూడా హీరో అయ్యాడు. అవసరమైన వారికి సహాయం చేయడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. తాజాగా బీహార్‌లోని నవాదా నగర్‌లో రెండు కళ్లూ అంధుడైన ఓ చిన్నారికి వైద్య ఖర్చులు భరించాడు. దీని ద్వారా ఓ అంధ బాలుడి జీవితం వెలుగులోకి వచ్చింది.

వారిద్దరికీ ప్రాణం పోసిన సోనూసూద్‌
బీహార్‌లోని నవాడా నగరంలోని పక్రిబరవన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోగన్ పంచాయతీ అమర్‌పూర్ గ్రామంలో గుల్షన్ అనే 11 నెలల పాప పుట్టుకతోనే అంధురాలు. కుటుంబం కూడా నిరుపేద కావడంతో చిన్నారికి ఆపరేషన్ చేయించుకునే స్థోమత లేదు. ఇలా చిన్నారి చికిత్సకు అయ్యే ఖర్చును భరించిన సోనూసూద్.. గుల్షన్‌కు కంటిచూపు వచ్చేలా చేశాడు.

అలాగే కొన్ని నెలల క్రితం ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి సోనూసూద్ సాయం చేశాడు. ఉజ్జయినిలోని కనిపూర్‌లోని తిరుపతి ధామ్‌లో నివసిస్తున్న అథర్వ స్పైనల్ మస్కులర్ అట్రాఫీ స్మా-2తో బాధపడుతున్నాడు. బాలుడి తల్లిదండ్రులు నటుడు సోనూసూద్‌ను కలుసుకుని చిన్నారి అనారోగ్యంపై తమ బాధను పంచుకున్నారు. అందువలన, వారు అధర్వకు చికిత్స కోసం అన్ని విధాలుగా సహాయం చేశారు. అంతే కాకుండా బిడ్డ చికిత్స కోసం వీలైనంత ఎక్కువ విరాళాలు అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. త్వరలో ఆ చిన్నారికి ఆపరేషన్‌ చేపించేందుకు ఆయన అన్నీ ఏర్పాట్లు చేశాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top