Vishnu Priya: నటి బర్త్‌డే, తులాలకొద్దీ బంగారం కొన్న నటుడు

Siddharth Varma Gifted Gold Jewellery To His Wife Actress Vishnu Priya - Sakshi

బుల్లితెర నటి విష్ణు ప్రియ సీరియల్స్‌లో తన నటనతో అదరగొడుతోంది. ప్రేక్షకులకు వినోదాన్ని అందించడంలో తగ్గేదే లేదన్నట్లుగా సీరియల్స్‌తో అలరిస్తోంది. అటు సోషల్‌ మీడియాలోనూ అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటున్న ఈ బ్యూటీ తన బర్త్‌డే కోసం షాపింగ్‌ చేసింది. బర్త్‌డే షాపింగ్‌ అంటే డ్రెస్సులు, మ్యాచింగ్‌ జ్యువెలరీస్‌ అనుకునేరు, కానే కాదు.. తన భర్తతో కలిసి బంగారు ఆభరణాల దుకాణానికి వెళ్లింది. తనకు నచ్చిన గాజులు, నెక్లెస్‌, ఇయర్‌ రింగ్స్‌లు ఎంపిక చేసుకుంది.

ఇవన్నీ కలిపితే 200 గ్రాములకు పైనే ఉంటుంది అని చెప్పుకొచ్చింది విష్ణుప్రియ. భార్య సెలక్ట్‌ చేశాక బిల్లు కట్టడమే తరువాయి అన్నట్లుగా వాటన్నింటినీ ప్యాక్‌ చేయించి డబ్బులు చెల్లించాడు ఆమె భర్త, నటుడు సిద్దార్థ్‌ వర్మ. బంగారం లాంటి భార్య పుట్టినరోజుకు ఈమాత్రం గోల్డ్‌ జ్యువెలరీ గిఫ్ట్‌ ఇవ్వలేనా అంటున్నాడు. ఇక దీనికి సంబంధించిన వీడియోను 'నా బర్త్‌ డేకి మావారి బంగారు కానుక' అంటూ యూట్యూబ్‌లో రిలీజ్‌ చేసింది విష్ణు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

చదవండి: ఇలాగైతే జనాలు థియేటర్‌కు ఎందుకు వస్తారు: నరేశ్‌ ఫైర్‌
బిగ్‌బాస్‌ పింకీ పెళ్లి? యాంకర్‌ రవి ఏమన్నాడంటే?

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top