
ఇటీవలే కూలీ మూవీతో అలరించిన కోలీవుడ్ ముద్దుగుమ్మ శృతిహాసన్. రజినీకాంత్- లోకేశ్ కనగరాజ్ కాంబోలో వచ్చిన ఈ చిత్రంలో ప్రీతి అనే అమ్మాయి పాత్రలో కనిపించింది. ఈ మూవీలో నటనకు శృతిహాసన్ ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రంలో టాలీవుడ్ కింగ్ నాగార్జున, బాలీవుడ్ హీరో అమిర్ ఖాన్ సైతం కీలక పాత్రలు పోషించారు. ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
అయితే రిలీజ్కు ముందు కూలీ మూవీ ప్రమోషన్లలో శృతిహాసన్ పాల్గొన్నారు. నటుడు సత్యరాజ్తో కలిసి ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తండ్రిలాగే శృతిహాసన్ కూడా చాలా భాషలు నేర్చుకుందని ప్రశంసించారు. కమల్ హాసన్ ఒక బెంగాలీ సినిమా చేశాడని..ఆ మూవీ కోసమే భాష నేర్చుకున్నాడని సత్యరాజ్ అన్నారు.
అయితే కమల్ హాసన్ బెంగాలీ నేర్చుకోవడంపై శృతిహాసన్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. అయితే తన తండ్రి సినిమా కోసం భాష నేర్చుకోలేదని సీక్రెట్ను రివీల్ చేసింది. బెంగాలీ నటి అపర్ణ సేన్తో ప్రేమలో పడ్డారని.. ఆమె కోసమే తన తండ్రి బెంగాలీ నేర్చుకున్నారని శృతి హాసన్ వెల్లడించింది. కూలీ ప్రమోషన్స్ సందర్భంగా శృతి ఈ విషయాన్ని పంచుకుంది.
శృతి హాసన్ మాట్లాడుతూ.. ' మా నాన్న బెంగాలీ ఎందుకు నేర్చుకున్నాడో తెలుసా? ఆ సమయంలో బెంగాలీ నటి అపర్ణ సేన్తో ప్రేమలో పడ్డారు. ఆమెను ఆకట్టుకోవడానికి నాన్న బెంగాలీ నేర్చుకున్నాడు. అంతేకానీ సినిమా కోసం కాదని' తెలిపింది. అంతేకాకుండా కమల్ హాసన్ దర్శకత్వం వహించిన హే రామ్ మూవీ గురించి కూడా మాట్లాడింది. ఆ చిత్రంలో రాణి ముఖర్జీ పాత్ర పేరు అపర్ణ అయితే.. అపర్ణ సేన్ అని పేరు పెట్టారని ఆమె వెల్లడించింది.
అపర్ణ సేన్ ఎవరంటే?
అపర్ణ సేన్ బెంగాలీ స్టార్ నటీమణుల్లో ఆమె ఒకరు. అంతేకాదు.. ఆమె చిత్రనిర్మాత కూడా. అపర్ణ సేన్ తొమ్మిది జాతీయ చలనచిత్ర అవార్డులను గెలుచుకుంది. అంతేకాకుండా 1987లో పద్మశ్రీతో సత్కరించారు. బాలీవుడ్ నటి కొంకోన సేన్ శర్మ ఆమె కూతురే కావడం విశేషం.