Samantha: కఠిన సమయంలో నాకు చేరువై, నాలో స్ఫూర్తి నింపావు..: సామ్‌ ఆసక్తికర పోస్ట్‌

Samantha Shares Her Latest GYM Workout Video in Instagram - Sakshi

స్టార్‌ హీరోయిన్‌ సమంత ఫిటినెస్‌ ఫ్రీక్‌ అనే విషయం తెలిసిందే. సమయం దొరికితే గంటలు గంటలు ఆమె జిమ్‌లోనే గడుపుతారు. అంతేకాదు జిమ్‌ హేవీ వర్క్‌అవుట్స్‌ చేస్తూ తరచూ వీడియోలు షేర్‌ చేసేది. అయితే ఇటీవల మయోసైటిస్‌ వ్యాధి బారిన పడిన సామ్‌ ప్రస్తుతం కోలుకుంటోంది. దీంతో తన తదుపరి ప్రాజెక్ట్స్‌పై దృష్టి పెట్టిన ఆమె జిమ్‌లో వర్క్‌ అవుట్స్‌ చేయడం స్టార్ట్‌ చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా తన ఫిటినెస్‌ వీడియోను షేర్‌ చేసింది. జిమ్‌లో పుల్‌ అప్స్‌ చేస్తోన్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.

చదవండి: మాస్‌ మహారాజా బర్త్‌డే సర్‌ప్రైజ్‌.. రావణాసుర ఫస్ట్‌ గ్లింప్స్‌ వచ్చేసింది

దీనికి ఆమె.. ‘‘కఠిన సమయంలో నాకు చేరువై, నాలో స్ఫూర్తి నింపిన ‘హూ ఈజ్‌ గ్రావిటీ’ బ్యాండ్‌కు ధన్యవాదాలు. సాధ్యమైనంత వరకూ కఠినతరమైన డైట్స్‌లో మనం తినే ఆహారం వల్ల బలం రాదని.. మన ఆలోచనా విధానం పైనా అది ఆధారపడి ఉంటుందన్నది నా అభిప్రాయం’’ అని సమంత రాసుకొచ్చింది. ఇక ఈ తాజా వీడియోపై పలువురు సినీ సెలబ్రెటీలు స్పందిస్తున్నారు. అంతేకాదు వెంకటేశ్‌ కూతురు అశ్రిత కూడా సామ్‌ పోస్ట్‌పై స్పందించింది. ఆమెకు మరింత బలం చేకూరాలని ఆకాంక్షిస్తూ ఎమోజీలతో కామెంట్స్‌ చేసింది.

చదవండి: కీరవాణికి పద్మశ్రీ వరించడంపై రాజమౌళి ఎమోషనల్‌ పోస్ట్‌

అలాగే సుశాంత్‌ కూడా కామెంట్స్‌ చేశాడు. ఇక డైరెక్టర్‌ నందిని రెడ్డి చేసిన కామెంట్‌ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ‘నువ్వు రెండు చేతులా చేస్తుంది.. నేను ఒక్క చేతితో చేస్తున్నాను. నువ్వు ఫీల్‌ అవుతానే ఆ వీడియో షేర్‌ చేయలేదు’ అంటూ చమత్కిరంచింది. కాగా సమంత నటించిన శాకుంతలం మూవీ త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రోడక్షన్‌ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం ఫిబ్రవరి 17న తెలుగుతో పాటు హిందీ, తమిళ్‌, మలయాళం, కన్నడలో విడుదల కానుంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top