Salman Khan Doop: బాలీవుడ్‌లో విషాదం.. జిమ్‌ చేస్తూ సల్మాన్‌ డూప్‌ మృతి.. ‘భాయిజాన్‌’ ఎమోషనల్‌ పోస్ట్‌

Salman Khan Body Double Sagar Pandey Last Breath While Doing Workout - Sakshi

సల్మాన్‌ ఖాన్‌ డూప్‌ సాగర్‌ పాండే కన్నుమూశారు. శుక్రవారం ఉదయం సాగర్‌ పాండే జిమ్‌ చేస్తుండగా అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడి ట్రైయిర్‌ వెంటనే ముంబైలోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందతూ తుదిశ్వాస విడిచారు. సాగర్‌ పాండే మృతిపట్ల బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ఈ మేరకు సల్మాన్‌ పోస్ట్‌ షేర్‌ చేస్తూ భావోద్వేగానికి గురయ్యాడు.

చదవండి: రాజమౌళి డైరెక్షన్‌లో నటించను: చిరంజీవి

ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ నివాళులు అర్పించాడు. ఈ సందర్భంగా ‘భాయిజాన్‌’ మూవీ సెట్‌లో సాగర్‌ పాండేతో కలిసి దిగిన ఫొటోను సల్మాన్‌ షేర్‌ చేస్తూ హార్ట్‌ బ్రేకింగ్‌ ఎమోజీని జత చేశాడు.  అలాగే బాలీవుడ్‌ సినీ సెలబ్రెటిలు, నటీనటులు సైతం సాగర్‌ పాండే మృతికి సంతాపం తెలుపుతున్నారు. కాగా సాగర్‌ పాండే సల్మాన్‌కు డూప్‌గా దాదాపు 50 చిత్రాల్లో నటించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top