లాంఛ‌నంగా ప్రారంభ‌మైన 'రుద్ర‌వీణ‌' | Rudraveena Movie Shooting Started With Pooja Ceremony | Sakshi
Sakshi News home page

Rudraveena: లాంఛ‌నంగా ప్రారంభ‌మైన 'రుద్ర‌వీణ‌'

Jan 26 2022 8:51 AM | Updated on Jan 26 2022 8:51 AM

Rudraveena Movie Shooting Started With Pooja Ceremony - Sakshi

సరికొత్త కథా కథనాలతో మా ‘రుద్రవీణ’ తెరకెక్కుతోంది. ప్రతిభ ఉన్న కొత్త నటీనటులతో పాటు మంచి సాంకేతిక నిపుణుల సపోర్ట్‌తో సినిమాను క్వాలిటీగా, అందరికీ నచ్చేలా తీస్తాం...

శ్రీరామ్‌ నిమ్మల, ఎల్సా ఘోష్, శుభశ్రీ, సోనియా సత్య హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘రుద్రవీణ’. జి. మధుసూదన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సంగీతదర్శకుడు రఘు కుంచె ప్రత్యేక పాత్ర చేస్తున్నారు. సాయివీల సినిమాస్‌ పతాకంపై రాగుల లక్ష్మణ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం యానాంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

జి. మధుసూదన్‌ రెడ్డి మాట్లాడుతూ–‘‘సరికొత్త కథా కథనాలతో మా ‘రుద్రవీణ’ తెరకెక్కుతోంది. ప్రతిభ ఉన్న కొత్త నటీనటులతో పాటు మంచి సాంకేతిక నిపుణుల సపోర్ట్‌తో సినిమాను క్వాలిటీగా, అందరికీ నచ్చేలా తీస్తాం. మా సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ కూడా యానాంలోనే జరుగుతోంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: జీఎల్‌ఎన్‌ బాబు, సంగీతం: మహావీర్‌ యేలేందర్, ప్రత్యేక పర్యవేక్షణ: కె. త్రివిక్రమ రావు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement