ఫ్యాలెస్‌లో పాట..స్టార్స్‌ అంతా ఒకే చోట

RRR Movie : Rajamouli And Team To Shoot A Song In Ukraine - Sakshi

రాజమౌళి ‘మగధీర’ సినిమా చివర్లో వచ్చే ‘ధీర ధీర’ పాట కనువిందుగా ఉంటుంది. సినిమాలో ఉన్న కీలక తారాగణంతో పాటు సాంకేతిక నిపుణులు కూడా ఈ పాటకు కాలు కదిపిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్‌)లోనూ అలాంటి పాటను చూపించాలనుకుంటున్నారట దర్శకుడు రాజమౌళి. జూనియర్‌ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ త్వరలో పూర్తి కానుంది.

ఈ షెడ్యూల్‌లో ఓ ప్రమోషనల్‌ సాంగ్‌ని చిత్రీకరించాలనుకుంటున్నారట. ఉక్రెయిన్‌లో ఓ ప్యాలెస్‌లో షూట్‌ చేయనున్నారని టాక్‌. హీరోలు తారక్, రామ్‌చరణ్, హీరోయిన్లు ఆలియా భట్, ఒలీవియా మోరిస్‌ తదితరులు ఈ పాటలో కనిపిస్తారట. ఈ చిత్రంలో స్వాతంత్య్ర సమర యోధులు కొమురం భీమ్‌గా జూనియర్‌ ఎన్టీఆర్, సీతారామరాజుగా రామ్‌చరణ్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. అక్టోబర్‌ 13న ఈ చిత్రం రిలీజ్‌. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top