Rashmika Mandanna: పుష్పరాజ్‌ సతీమణి శ్రీవల్లీ లుక్‌ చూశారా..? | Rashmika Mandanna New Look Poster Revealed By Pushpa Team‌ | Sakshi
Sakshi News home page

పుష్పరాజ్‌ సతీమణి శ్రీవల్లీ లుక్‌ చూశారా..?

Apr 5 2024 12:06 PM | Updated on Apr 5 2024 12:15 PM

Rashmika Mandanna Look Reveal From Pushpa Team‌ - Sakshi

సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం 'పుష్ప: ది రూల్‌'. ఈ చిత్రంలో శ్రీవల్లీగా  'రష్మిక మందన్న' నటిస్తున్న విషయం తెలిసిందే. నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా తాజాగా పార్ట్‌-2 సంబంధించిన లుక్‌ను మేకర్స్‌ తాజాగా రివీల్‌ చేశారు.

మొదటి భాగంలో చాలా సింపుల్‌గా కనిపించిన శ్రీవల్లీ పార్ట్‌-2లో మాత్రం చాలా రిచ్‌గా కనిపిస్తోంది. ఒంటి నిండా బంగారు నగలతో మెరిసిపోతుంది. ఇప్పటి వరకు చూసిన శ్రీవల్లీ ఓ లెక్క ఇకనుంచి చూడబోయే శ్రీవల్లీ మరో లెక్క అన్నట్లు ఆ పోస్టర్‌ ఉంది. రష్మిక పుట్టినరోజు సందర్భంగా తాజాగా విడుదలైన ఈ పోస్టర్‌ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. పార్ట్‌-1 సమయంలో విడుదల చేసిన లుక్‌తో.. ఇప్పుడు విడుదల చేసిన లుక్‌ను పోలుస్తూ నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. రష్మిక మరింత పవర్‌ఫుల్‌గా ఇందులో కనిపించబోతుందని వారు చెప్పుకొస్తున్నారు.

మొదటిభాగం చివర్లో పుష్పరాజ్‌కు శ్రీవల్లితో పెళ్లి అయినట్లు చూపిన సంగతి తెలిసిందే.. ఇక రెండో పార్ట్‌లో పుష్పకు భార్యగా ఆమె కనిపించనుంది. ఈ సీక్వెల్‌లో ఆమె పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సుకుమార్‌ తెరకెక్కించిన ఈ సినిమా ఆగష్టు 15న విడుదల కానుందని మరోసారి మేకర్స్‌ ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement