'పుష్ప 2' పీలింగ్స్‌ సాంగ్‌.. ఇబ్బందిగా ఫీలయ్యా.. కానీ.. : రష్మిక మందన్నా | Rashmika Mandanna Comments On Pushpa 2 Movie Peelings Song Dance Steps, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

Rashmika Mandanna: పీలింగ్స్‌ సాంగ్‌లో అల్లు అర్జున్‌తో స్టెప్పులు.. మొదట అసౌకర్యంగా ఫీలయ్యా..

Dec 22 2024 2:45 PM | Updated on Dec 22 2024 3:58 PM

Rashmika Mandanna on Dance Steps in Peelings Song from Pushpa 2 Movie

పాన్‌ ఇండియా బ్లాక్‌బస్టర్‌ పుష్ప 2 మూవీ ఇప్పటివరకు రూ.1600 కోట్లపైనే వసూళ్లు రాబట్టింది. అల్లు అర్జున్‌, రష్మిక మందన్నా ‍ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తోంది. ఈ మూవీలోని పాటలన్నీ కూడా మంచి రెస్పాన్స్‌ అందుకున్నాయి. అయితే పీలింగ్స్‌ పాట మాత్రం కాస్త సంచలనానికి తెర తీసింది.

పీలింగ్స్‌ పాటపై రష్మిక రియాక్షన్‌
సాంగ్‌లోని కొన్ని స్టెప్పులపై సోషల్‌ మీడియా వేదికగా పలువురూ అభ్యంతరం తెలిపారు. మరికొందరేమో కొత్తగా ట్రై చేశారు, బాగుందంటూ మెచ్చుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రష్మిక మందన్నా పీలింగ్స​ పాటపై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ.. 'పీలింగ్స్‌ రిహార్సల్‌ వీడియో చూసినప్పుడు ఎంతో ఆశ్చర్యపోయాను. అల్లు అర్జున్‌ సర్‌తో కలిసి డ్యాన్స్‌ చేశాను అని మురిసిపోయాను. 

నాకు ఆ ఫోబియా ఉంది
కానీ మొదట చాలా భయమేసింది. ఎవరైనా నన్ను ఎత్తుకుంటే భయమేస్తుంది. ఈ పాటలో బన్నీ సర్‌ నన్ను ఎత్తుకుని స్టెప్పేస్తాడు. మొదట అసౌకర్యంగా ఫీలయ్యాను. కానీ సుకుమార్‌, బన్నీ సర్‌ నన్ను ఆ ఇబ్బంది నుంచి బయటపడేశారు. ఒక్కసారి ఆయన్ను నమ్మాక అదేమంత ఇబ్బందిగా అనిపించలేదు. అంతా ఫన్‌గా జరిగిపోయింది.

కొందరికి నచ్చకపోవచ్చు
నాపై నేనే డౌట్‌ పడితే నటిగా రాణించడం కష్టం. నేనున్నది జనాలను ఎంటర్‌టైన్‌ చేయడానికే! మరీ ఎక్కువ ఆలోచిస్తే నా కొమ్మను నేనే నరుకున్నట్లు అవుతుంది. అలా చేయడం నాకిష్టం లేదు. ఇకపోతే ఈ పాట కొందరికి నచ్చకపోవచ్చు. ప్రతీది అందరికీ నచ్చాలనేం లేదు' అని రష్మిక చెప్పుకొచ్చింది.

 

చదవండి: 'సలార్' రిజల్ట్‌తో నేను హ్యాపీగా లేను: ప్రశాంత్ నీల్

Advertisement
 
Advertisement
Advertisement