Rashmika Mandanna Talk About Dulquer Salmaan's Sita Ramam Movie Success Deets Inside - Sakshi
Sakshi News home page

Rashmika Mandanna: ఇప్పుడే మొదలుపెట్టా, ఇంకా చాలా చేయాలి..

Aug 8 2022 5:44 PM | Updated on Aug 8 2022 6:11 PM

Rashmika Mandanna About Sita Ramam Movie Success - Sakshi

ప్రయోగాత్మక చిత్రాలు చేయడం కూడా చాలా ముఖ్యం. కంఫర్ట్ జోన్‌లో ఉండటం బాగానే ఉంటుంది. అయితే ఒక నటిగా అన్ని డిఫరెంట్ పాత్రలు చేయాలని వుంది. ఇప్పుడు నా కంఫర్ట్ జోన్ దాటి కొన్ని సినిమాలు చేస్తున్నా. 

స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా, రష్మిక మందన్నా కీలక పాత్రలో నటించిన చిత్రం సీతారామం. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీ వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మించాడు. ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 5న విడుదలైన ఈ సినిమా క్లాసిక్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో అఫ్రిన్‌గా కనిపించిన రష్మిక పాత్రకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. తాజాగా సీతారామం విజయం గురించి రష్మిక విలేకరుల సమావేశంలో మాట్లాడింది.

అఫ్రిన్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఎలా ఫీలవుతున్నారు ?
'సీతారామం' విజయం చాలా ఆనందాన్నిచ్చింది. 'సీతారామం' కోసం టీమ్ అంతా దాదాపు రెండేళ్ళ పాటు చాలా హార్డ్ వర్క్ చేశారు. కష్టానికి తగ్గ ఫలితం ప్రేక్షకులు క్లాసిక్ బ్లాక్ బస్టర్ రూపంలో ఇచ్చారు. దర్శకుడు హను గారు అఫ్రిన్ పాత్ర గురించి చెబుతూ ఆ పాత్రలో గ్రేట్ ఆర్క్ వుందన్నారు. నేను కూడా దాన్ని బలంగా నమ్మాను. మా నమ్మకం నిజమైయింది.  

అఫ్రిన్ పాత్ర మీకు ఎంతవరకు సవాల్ గా అనిపించింది ? 
అఫ్రిన్ లాంటి వైలెంట్ పాత్ర ఇంతవరకూ చేయలేదు(నవ్వుతూ). ఇది ఛాలెంజ్‌గా, చాలా కొత్తగా అనిపించింది.

సీతారామం కథ మీ దగ్గరికి వచ్చినపుడు ఎలా అనిపించింది ? 
సీతారామం నాకు ఖచ్చితంగా డిఫరెంట్ మూవీ. నేను ఇప్పటివరకూ హీరోయిన్ గానే చేశాను. అయితే ఒక నటిగా విభిన్నమైన పాత్రలు చేయాలని వుంటుంది. సీతారామంలో నా పాత్ర చాలా యునిక్‌గా అనిపించింది. ఒక గొప్ప కథని చెప్పే పాత్ర కావడం నాకు చాలా నచ్చింది. రాబోతున్న సినిమాల్లో కూడా కొన్ని డిఫరెంట్ రోల్స్ చేస్తున్నా. 

కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నపుడు ప్రయోగాత్మక చిత్రాలు చేయడంలో  రిస్క్ ఉంటుందా?
ప్రయోగాత్మక చిత్రాలు చేయడం కూడా చాలా ముఖ్యం. కంఫర్ట్ జోన్‌లో ఉండటం బాగానే ఉంటుంది. అయితే ఒక నటిగా అన్ని డిఫరెంట్ పాత్రలు చేయాలని వుంది. ఇప్పుడు నా కంఫర్ట్ జోన్ దాటి కొన్ని సినిమాలు చేస్తున్నా. 

డ్రీమ్ రోల్స్ ఏమైనా ఉన్నాయా ? 
పీరియాడికల్ మూవీ చేయాలని ఉంది. అలాగే స్పోర్ట్స్, యాక్షన్, బయోపిక్.. ఇలా డిఫరెంట్ మూవీస్ చేయాలనీ ఉంటుంది. ఇప్పుడే మొదలుపెట్టాం కదా.. ఇంకా చాలా చేయాలి. 

హిందీలో ఒక్క సినిమా విడుదల కాకముందే మూడు అవకాశాలు వచ్చాయి కదా ? మీరు లక్కీ అని భావిస్తున్నారా ?
హిందీలోనే కాదు .. తెలుగులోనూ ఇలా జరిగింది. ఛలో షూటింగ్‌లో ఉండగానే గీతాగోవిందం, దేవదాస్ చిత్రాల అవకాశాలు వచ్చాయి. సరైన కథలు వస్తున్నపుడు అలా జరిగిపోతాయి. అదృష్టంతో పాటు హార్డ్ వర్క్‌ను నమ్ముతాను. 

చదవండి: థియేటర్‌, ఓటీటీలో సందడి చేసే సినిమాలివే!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement