
అద్దాల మేడలున్నాయే.. మేడల్లా మంచి చిరాలున్నాయే అంటూనే 'రాను బొంబాయికి రాను' అనే లిరిక్స్‌తో ఒక ఫోక్ సాంగ్ రెండు నెలలుగా నెట్టింట దుమ్మురేపుతుంది. ఈ పాట కోసం రాము రాథోడ్, లిఖిత వేసిన స్టెప్పులకు సోషల్‌మీడియా దద్దరిల్లిపోయింది. అయితే, ఈ పాటను రాము రాథోడ్ రచించడమే కాకుండా సింగర్ ప్రభతో ఆలపించాడు. శేఖర్ వైరస్ కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన ఈ పాటను వాలి నిర్మించారు. కళ్యాణ్ కీస్ సంగీతం అందించారు. అయితే, ఇప్పటికే వారి అధికారిక యూట్యూబ్ ఛానల్‌లోనే 115 మిలియన్లకు పైగానే వ్యూస్ సాధించి టాప్ వన్ మ్యూజిక్ వీడియో విభాగంలో కొనసాగుతుంది. భాషతో సంబంధం లేకుండా ఇతరులు కూడా వేలల్లో తమ కామెంట్లతో వారిని ప్రశంసిస్తున్నారు.
ఈ సాంగ్ నిర్మించడం కోసం సుమారు రూ. 5 లక్షల వరకు ఖర్చు చేశామని రాము రాథోడ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అయితే, ఇప్పటి వరకు ఈ సాంగ్ వల్ల తమకు సుమారు రూ. 20 లక్షల వరకు ఆదాయం వచ్చిందని చెప్పడం విశేషం. ఈ సాంగ్ మీద మిలియన్ల కొద్ది రీల్స్ కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ ఏడాదిలో వచ్చిన ఫోక్ సాంగ్స్‌లలో ఇది టాప్‌లో ట్రెండ్ అవుతుంది.
'సొమ్మసిల్లి పోతున్నవే ఓచిన్న రాములమ్మ' సాంగ్‌ను కూడా రాము రాథోడ్ రచించడమే కాకుండా ఆలపించాడు కూడా.. 2022లో రిలీజైన ఈ పాట 290+ మిలియన్ (29 కోట్లకుపైగా) వ్యూస్ సాధించింది. అప్పట్లో ఈ సాంగ్ యూట్యూబ్‌లో ఓ సెన్సేషన్.. అందుకే ఇదే సాంగ్‌ను ‘మజాకా’ సినిమాలో రీ క్రియేట్ చేశారు.