మన దేహం దేవాలయంలాంటిది: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

Rakul Preet Singh shares note on body, mind and soul - Sakshi

‘‘మన దేశంలో హెల్త్, ఫిట్‌నెస్‌కు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వరు. మన శరీరాన్ని మనమే కాపాడుకోవాలి. మన దేహం దేవాలయం లాంటిది. ఇంట్లో చెత్త లేకుండా చూసుకుంటాం. మరి దేహంలో కూడా చెత్త లేకుండా చూసుకోవాలి’’ అని హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌సింగ్‌ అన్నారు. ఫిట్‌నెస్, యోగా, ఆహారపు అలవాట్లపై రకుల్‌ మాట్లాడుతూ– ‘‘వ్యాయామం, యోగాను కలిపి చేయడం చాలా మంచిది. వ్యాయామం ఫిట్‌నెస్‌ ఇస్తే, యోగా పాజిటివ్‌ దృక్పథాన్ని కల్పిస్తుంది. నాకు నచ్చిన ఫుడ్‌ని ఫుల్‌గా తింటాను, కానీ యోగా–జిమ్‌ చేస్తాను. కనీసం రోజుకు 5 నిమిషాలు ఫిట్‌నెస్, యోగా ఎడ్యుకేషన్‌ గురించి తెలుసుకోవాలి.

ఒకర్ని చూసి వ్యాయామాలు చేయడం, ఆహారపు అలవాట్లు మార్చుకోవడం చేయొద్దు. మీ శరీరానికి తగ్గదే తినండి, అలాంటి వ్యాయామాలే చేయండి. శరీరం మాత్రమే కాదు.. మనసు కూడా లైట్‌గా ఉండాలి. ఆరోగ్యం కోసం కొంతమంది అదే పనిగా సలాడ్స్‌ తింటారు. అది మంచిది కాదు. కొన్ని వండుకొని తినాలి. ఇంకా చెప్పాలంటే మన అమ్మమ్మల కాలం నాటి భోజనాలకి వెళ్లిపోవాలి. అదే సరైన పద్ధతి. తాత–అమ్మమ్మల కాలం నాటి వంటకాల వల్ల ఒంట్లో కొవ్వు చేరదు. ఫిట్‌నెస్‌ను లైఫ్‌ స్టయిల్‌గా చూడాలి. అది మన జీవితంలో భాగమైనప్పుడు ఆరోగ్యంగా ఉంటాం’’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top