హీరో విజయ్‌ ర్యాలీలో ప్రమాదాలు.. యువతను హెచ్చరించిన రజనీకాంత్‌ | Rajinikanth: Don't Run Behind Actors Vehicles | Sakshi
Sakshi News home page

Rajinikanth: హీరోల వెంట పడొద్దు, చదువుకోండి ఫస్టు!

Apr 9 2026 8:28 AM | Updated on Apr 9 2026 8:46 AM

Rajinikanth: Don't Run Behind Actors Vehicles

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ జైలర్‌–2 మూవీ షూటింగ్‌ పూర్తి చేశారు. ప్రస్తుతం సిబి చక్రవర్తి దర్శకత్వంలో కమల్‌హాసన్‌తో కలిసి రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ సంస్థ నిర్మిస్తున్న చిత్ర షూటింగ్‌లో పాల్గొనడానికి సిద్ధం అవుతున్నారు. ఇదిలా ఉంటే రజనీకాంత్‌ బుధవారం ఉదయం చైన్నె విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. విజయ్‌ నటించిన జననాయకన్‌ చిత్ర విడుదలకు ఆటంకాలు కలగజేయడం, విజయ్‌ కారు వెంటపడి యువత ప్రమాదాలకు గురవడం, కమల్‌హాసన్‌తో నటించడం వంటి పలు విషయాల గురించి విలేకరులు ప్రశ్నల వర్షం కురిపించారు.

చదువుకోండి
కాగా విజయ్‌ నటించిన జననాయకన్‌ సినిమాపై స్పందించేందుకు రజనీకాంత్‌ ఇష్టపడలేదు. అయితే నటుల వాహనాల వెనక పడి యువత ప్రమాదాలకు గురవుతున్నారని, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. చదువుకునే వయసులో విద్యపైనే పూర్తిగా శ్రద్ధ పెట్టాలని, చదువుకునే సమయాన్ని అశ్రద్ధ చేస్తే జీవితంలో చాలా కష్టపడాల్సి ఉంటుందన్నారు. 

దూరంగా ఉండండి
అదేవిధంగా యువత మద్యానికి, గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు బానిస కాకూడదన్నారు. అలాంటి దురలవాట్లు కలిగిన ఫ్రెండ్స్‌ను దూరం పెట్టాలన్నారు. ఇకపోతే తాను, కమల్‌ హాసన్‌ కలిసి నటించనున్న చిత్రం ఆగస్టులో ప్రారంభం అవుతుందని రజనీకాంత్‌ తెలిపారు. విజయ్‌ ప్రచార కార్యక్రమాలకు యువత భారీ సంఖ్యలో హాజరవుతున్న తరుణంలో రజనీకాంత్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

Advertisement
 
Advertisement
Advertisement