ఆ థియేటర్లలో మా సినిమాలు వేయం | Telugu Producers Guild Against Theatre Percentage System | Sakshi
Sakshi News home page

Tollywood: థియేటర్ పర్సంటేజీపై ప్రొడ్యూసర్స్ గిల్డ్ వ్యతిరేకత

Apr 9 2026 4:12 AM | Updated on Apr 9 2026 4:12 AM

Telugu Producers Guild Against Theatre Percentage System

తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC).. సింగిల్ స్క్రీన్ థియేటర్లలోనూ పర్సంటేజీ విధానంపై సినిమాలు ప్రదర్శించాలని ఆదేశించింది. దీనిపై ఇప్పుడు టాలీవుడ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ వ్యతిరేకత వ్యక్తం చేసింది. ఫిల్మ్ ఛాంబర్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయం ఆమోదయోగ్యంగా లేదని పేర్కొంది. పాత పద్ధతినే కొనసాగించాలని డిమాండ్ చేసింది.

ఎగ్జిబిటర్లతో చర్చలు జరిపి తమ కండీషన్స్ మేరకు సినిమాలని విడుదల చేస్తామని.. అలానే ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయించిన పర్సంటేజీ విధానం అనుసరించే థియేటర్లలో తమ చిత్రాల్ని ప్రదర్శించేందుకు సిద్ధంగా లేమని గిల్డ్ తేల్చి చెప్పింది. ఈ మేరకు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్‌కి లేఖలో ఈ విషయాల్ని పేర్కొంది.

ప్రస్తుతం యాక్టింగ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ సభ్యుల్లో రవిశంకర్, టీజీ విశ్వప్రసాద్, నాగవంశీ, రవికిశోర్, సుప్రియ, స్వప్నదత్, సుధాకర్ చెరుకూరి, బాపినీడు, సాహు గారపాటి తదితరులు ఉన్నారు. అద్దె విధానానికి బదులు మల్టీప్లెక్స్ తరహాలో పర్సంటేజీ విధానంలోకి హైదరాబాద్‌లోని 23 సింగిల్ స్క్రీన్ థియేటర్లు వస్తాయని ఫిల్మ్ ఛాంబర్ ఈ మధ్యే నిర్ణయించింది. ఈనెల 3వ తేదీ నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందని తెలిపింది. కానీ ఇప్పుడు ప్రొడ్యూసర్స్ గిల్డ్ దీన్ని వ్యతిరేకిస్తూ లేఖ రాసింది.

Advertisement
 
Advertisement
Advertisement