భావోద్వేగాల లెనిన్‌  | Akhil Akkineni Lenin Poster Released | Sakshi
Sakshi News home page

భావోద్వేగాల లెనిన్‌ 

Apr 9 2026 5:48 AM | Updated on Apr 9 2026 5:58 AM

Akhil Akkineni Lenin Poster Released

అఖిల్‌ అక్కినేని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్‌’. మురళీ కిషోర్‌ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్‌ ఎల్‌ఎల్‌పీ, సితార ఎంటర్‌టైన్మెంట్స్‌పై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఏప్రిల్‌ 8న అఖిల్‌ పుట్టినరోజు సందర్భంగా ‘లెనిన్‌’ నుంచి కొత్త పోస్టర్‌ని విడుదల చేశారు.

 ‘‘ఓ డిఫరెంట్‌ స్టోరీతో ‘లెనిన్‌’ రూపొందిస్తున్నాం. భావోద్వేగాలతో పాటు ఆకట్టుకునే కథనంతో కంప్లీట్‌ సినిమాటిక్‌ ప్యాకేజీగా ఈ చిత్రాన్ని  తెరకెక్కిస్తున్నాం. ఈ సినిమాని భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు మురళీ కిషోర్‌ అబ్బూరు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌ సింగిల్‌తో మా చిత్రంపై మంచి బజ్‌ ఏర్పడింది. అక్కినేని అభిమానులకు, సినీ ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతినిచ్చేలా మా మూవీ ఉంటుంది’’ అని  చిత్రయూనిట్‌ పేర్కొంది. జూన్‌ 26న విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: లియోన్‌ బ్రిట్టో.

Advertisement
 
Advertisement
Advertisement