సుకుమారి పూర్తి  | Thiruveer-Aishwarya Rajesh Oh. Sukumari Shooting Completed | Sakshi
Sakshi News home page

సుకుమారి పూర్తి 

Apr 9 2026 5:54 AM | Updated on Apr 9 2026 5:54 AM

Thiruveer-Aishwarya Rajesh Oh. Sukumari Shooting Completed

‘మసూద, ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్‌ షో’ చిత్రాల ఫేమ్‌ తిరువీర్‌ హీరోగా, ఐశ్వర్యా రాజేష్‌ హీరోయిన్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఓ..! సుకుమారి’. భరత్‌ దర్శన్‌ దర్శకత్వంలో గంగా ఎంటర్‌టైన్మెంట్స్‌పై మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్‌ తాజాగా పూర్తయింది. ఈ సందర్భంగా రిలీజ్‌ చేసిన ఫొటోలో తిరువీర్, ఐశ్వర్యతో పాటు టీమ్‌ మొత్తం హ్యాపీ వైబ్‌లో కనిపించారు. 

‘‘వినోదాత్మక చిత్రంగా రూపొందుతోన్న మూవీ ‘ఓ..! సుకుమారి’. ‘రజాకార్, పొలిమేర’ చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించిన సీహెచ్‌ కుషేందర్‌ ఈ చిత్రానికి కెమెరామేన్‌గా వ్యవహరించారు. భరత్‌ మంచిరాజు మంచి సంగీతం అందించారు. మా సినిమాని  తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది.    

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement