నాకు నచ్చిందంటే నా భార్య వద్దన్నా వినను: హీరో | Gautham Ram Karthik About Act With Wife Manjima Mohan | Sakshi
Sakshi News home page

భార్య సలహా తీసుకుంటా.. ఒక్కోసారి ఆమె చెప్పినా వినను!

Apr 9 2026 8:44 AM | Updated on Apr 9 2026 8:52 AM

Gautham Ram Karthik About Act With Wife Manjima Mohan

దివంగత నటుడు ముత్తరామన్‌ మనవడిగా, ప్రముఖ నటుడు కార్తీక్‌ కుమారుడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చాడు గౌతమ్‌ రామ్‌ కార్తీక్‌. మణిరత్నం దర్శకత్వం వహించిన కడల్‌ అనే చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయమవగా, తొలి చిత్రంతో మంచి గుర్తింపు పొందాడు. ఆ తరువాత వరుసగా చిత్రాలు చేసుకుంటూ పోయాడు. 2022లో నటి మంజిమ మోహన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఇతడు క్రిమినల్‌, మిస్టర్‌ ఎక్స్‌, రన్నింగ్‌ అవుట్‌ ఆఫ్‌ టైమ్‌, లెగసీ వంటి పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.

ఆయనతో నటించడం..
తాజాగా అతడు మాట్లాడుతూ.. లెగసీ చిత్రంలో నటుడు మాధవన్‌తో కలిసి నటించడం మంచి అనుభవం అన్నాడు. ఆయన తనకు చాలా సూచనలు ఇచ్చారన్నాడు. ఈ చిత్రంలో తనది కొంచెం నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్ర అనీ, అయితే అలా ఎందుకు ప్రవర్తిస్తాను? అన్న దానికి కారణం కూడా ఉంటుందన్నాడు. ప్రస్తుతం చేస్తున్న చిత్రాలన్నీ యాక్షన్‌ కథా చిత్రాలేనని, మంచి రొమంటిక్‌ కామెడీ కథా చిత్రాలు చేయాలని కోరుకుంటున్నానని చెప్పాడు. తాను అంగీకరించే కథల గురించి తన భార్య మంజిమ మోహన్‌తో చర్చిస్తానని తెలిపాడు. 

భార్య చెప్పినా వినను
ఆమె నటి కాబట్టి సలహాలు తీసుకుంటానన్నాడు. అయితే ఒక్కోసారి ఆమె వద్దని చెప్పినా, తాను ఆ పాత్రకు న్యాయం చేయగలనని అనిపిస్తే నటించడానికి అంగీకరిస్తానన్నాడు. తన తండ్రి కార్తీక్‌తో కలిసి నటించడానికి తానెప్పుడూ సిద్ధమేనని, కాకపోతే అందుకు తగ్గ మంచి కథ కుదరాలన్నాడు. భార్య మంజిమ మోహన్‌తో నటించరా? అని అడుగుతున్నారని, ఆమెతో నటించడానికి ఎప్పుడూ రెడీనే అని, మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపాడు.

Advertisement
 
Advertisement
Advertisement