అల్లు అర్జున్‌- అట్లీ మూవీ టైటిల్‌ ఇదే.. రాక్షసుడిగా బన్నీ లుక్‌! | AA26: Allu Arjun, Atlee Movie Titled As Raaka | Sakshi
Sakshi News home page

Allu Arjun: 'రాకా' పోస్టర్‌ రిలీజ్‌.. ఊహించని లుక్‌లో బన్నీ..

Apr 8 2026 11:06 AM | Updated on Apr 8 2026 12:51 PM

AA26: Allu Arjun, Atlee Movie Titled As Raaka

పుష్ప సినిమాతో అల్లు అర్జున్‌ రేంజ్‌ మారిపోయింది. అప్పటివరకు సౌత్‌లో ఫాలోయింగ్‌ తెచ్చుకున్న అతడు పుష్ప తర్వాత పాన్‌ ఇండియా స్థాయిలో క్రేజ్‌ సంపాదించుకున్నాడు. నేషనల్‌ లెవల్‌లోనే కాదు ఇంటర్నేషనల్‌ లెవల్‌లోనూ గుర్తింపు పొందాడు. అంతర్జాతీయ సినీ మ్యాగజైన్‌ ది హాలీవుడ్‌ రిపోర్టర్‌ కవర్‌ పైజీపైనా స్థానం సంపాదించుకున్నాడు. సినిమా కోసం ఎంతదూరమైనా వెళ్లే బన్నీ.. ప్రస్తుతం అట్లీ డైరెక్షన్‌లో భారీ బడ్జెట్‌ సినిమా చేస్తున్నాడు.

రాకా
ఈ మూవీకి లెగసీ, అయాన్‌, స్పార్క్‌.. ఇలా రకరకాల టైటిల్స్‌ పరిశీలించగా చివరాఖరకు ఓ మంచి టైటిల్‌ను ఫైనల్‌ చేశారు. నేడు (ఏప్రిల్‌ 8న) అల్లు అర్జున్‌ బర్త్‌డే సందర్భంగా ఈ చిత్రానికి "రాకా" టైటిల్‌ను ప్రకటించారు. అలాగే పోస్టర్‌ కూడా వదిలారు. ఇందులో బన్నీ అరగుండుతో, తోడేలు వంటి చేయితో నెగెటివ్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఇది చూసిన అభిమానులు పోస్టర్‌ చాలా వైవిధ్యంగా ఉందని, బన్నీ లుక్‌తో తమ కడుపు నింపేశారని చిత్రయూనిట్‌ను కొనియాడుతున్నారు.

సినిమా
రాకా సినిమా విషయానికి వస్తే.. ఇది పునర్జన్మల కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న చిత్రమని సమాచారం. ఇందులో బన్నీ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు ముందునుంచి ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో నేడు రాక్షసుడిగా బన్నీ లుక్‌ను వదిలినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీలో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తోంది. అలాగే మరో ఇద్దరు హీరోయిన్లు కూడా ఇందులో భాగం కానున్నారని తెలుస్తోంది. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఈ సినిమాను రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

 

 

చదవండి: నయన్‌ సడన్‌ సర్‌ప్రైజ్‌.. స్టేజ్‌పై భర్త ఎమోషనల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement