నన్ను కొత్తగా చూస్తారు | Raghava Lawrence, SJ. Surya Speech At Jigarthanda DoubleX Pre Release Event | Sakshi
Sakshi News home page

నన్ను కొత్తగా చూస్తారు

Nov 7 2023 5:47 AM | Updated on Nov 7 2023 5:47 AM

Raghava Lawrence, SJ. Surya Speech At Jigarthanda DoubleX Pre Release Event - Sakshi

ఎస్‌జే సూర్య, రాఘవా లారెన్స్‌

రాఘవా లారెన్స్, ఎస్‌జే సూర్య ప్రధాన ΄ాత్రల్లో నటించిన పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా ‘జిగర్‌ తండ డబుల్‌ ఎక్స్‌’. కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో కార్తికేయన్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా రాఘవా లారెన్స్, ఎస్‌జే సూర్య హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో చెప్పిన విశేషాలు.

లారెన్స్‌ మాట్లాడుతూ – ‘‘జిగర్‌ తండ’ సినిమాలోని గ్యాంగ్‌స్టర్‌ ΄ాత్రలో నటించే తొలి అవకాశం నాకే వచ్చింది. కానీ అప్పుడు ఇతర ్ర΄ాజెక్ట్స్‌తో బిజీగా ఉండటం వల్ల చేయడం కుదర్లేదు. ఆ తర్వాత ‘జిగర్‌ తండ’కు రెండు జాతీయ అవార్డులు వచ్చాయి. దీంతో ‘జిగర్‌ తండ’ కు సీక్వెల్‌ ఉన్నట్లయితే అందులో నేను నటిస్తానని కార్తీక్‌ సుబ్బరాజుకి చె΄్పాను. ఈ సీక్వెల్‌ ‘జిగర్‌ తండ: డబుల్‌ ఎక్స్‌’ కథ సిద్ధమైన ఏడాది తర్వాత కార్తీక్‌ సుబ్బరాజు ఫోన్‌ చేసి చె΄్పారు.

కథ నచ్చడంతో ఈ సినిమాలో నటించాను. ∙ఈ సినిమా విషయంలో దర్శకుడు కార్తీక్‌ చెప్పినట్లు చేశాను. ప్రేక్షకులు కొత్త రాఘవా లారెన్స్‌ని చూస్తారు. సినిమా ఫస్టాప్‌లో యాక్షన్, సెకండాఫ్‌లో భావోద్వేగాల సన్నివేశాలు ఉంటాయి. ముఖ్యంగా చివరి 20 నిమిషాలు ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా ఉంటుంది. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకుల హృదయం కూడా బరువెక్కుతుంది. ∙త్వరలో ‘కాంచన 4’ స్టార్ట్‌ చేస్తాను. ఇక సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌గారి కోసమే కాదు.. సూపర్‌స్టార్, మెగాస్టార్‌ (చిరంజీవిని ఉద్దేశిస్తూ..) కలిసి యాక్ట్‌ చేసే ఓ మల్టీస్టారర్‌ స్క్రిప్ట్‌ నా దగ్గర ఉంది. కానీ వారు యాక్ట్‌ చేయాలి కదా’’ అన్నారు.

నటుడు– దర్శకుడు ఎస్‌జే సూర్య మాట్లాడుతూ– ‘‘దర్శకత్వం–నటన..ఈ రెండింటిలో నాకు నటన అంటేనే ఇష్టం. అయితే నా కెరీర్‌ ్ర΄ారంభంలో యాక్టింగ్‌ అవకాశాల కోసం డైరెక్షన్‌ని వారధిగా వినియోగించుకున్నాను. ఇక ‘జిగర్‌ తండ: డబుల్‌ఎక్స్‌’లో లారెన్స్‌గారిది గ్యాంగ్‌స్టర్‌ రోల్‌. నాదేమో దర్శకుడు కావాలనుకునే ΄ాత్ర. నా ΄ాత్రలో సత్యజిత్‌ రేగారి సినిమాల రిఫరెన్స్‌ ఉండటంతో ఇదొక బహుమతిగా భావించి ఈ మూవీ చేశాను. మంచి మాస్‌ కమర్షియల్‌ అంశాలు ఉన్న సందేశాత్మక చిత్రం ఇది. ఈ సినిమా షూటింగ్‌ కోసం ఓ విలేజ్‌ సెట్‌ వేయాల్సి వచ్చింది. ఇందులో భాగంగా ఓ రోడ్, బ్రిడ్జ్‌ వేశాం. అప్పటికే రోడ్, బ్రిడ్జ్‌ సౌకర్యాలు లేక ఇబ్బందిపడుతున్న ఆ గ్రామస్తులకు ఇవి ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి. నేను నటిస్తూ, నా దర్శకత్వంలో ఓ సినిమా రానుంది’’ అని చెప్పుకొచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement