అందులో స్ట్రగుల్‌ అవుతున్నానేమో!  | Dulquer Salmaan Speech at Kaantha press conference | Sakshi
Sakshi News home page

అందులో స్ట్రగుల్‌ అవుతున్నానేమో! 

Nov 13 2025 4:34 AM | Updated on Nov 13 2025 4:34 AM

Dulquer Salmaan Speech at Kaantha press conference

– దుల్కర్‌ సల్మాన్‌ 

‘‘కాంత’ నా కెరీర్‌లోనే స్పెషల్‌ ఫిల్మ్‌. ఇలాంటి చిత్రాలు జీవితంలో ఒకసారే వస్తాయి. ఈ సినిమాలోని ప్రతి క్యారెక్టర్‌కు ఒక ఎనర్జీ ఉంటుంది. డ్రామా, ఎమోషన్స్‌ అద్భుతంగా ఉంటాయి. ఆడియన్స్‌కు ఒక అద్భుతమైన సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ అందిస్తుంది’’ అని దుల్కర్‌ సల్మాన్‌ అన్నారు. దుల్కర్‌ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కాంత’. సముద్ర ఖని, రానా ముఖ్య పాత్రల్లో నటించారు. రానా, దుల్కర్‌ సల్మాన్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం విలేకరుల సమావేశంలో దుల్కర్‌ సల్మాన్, రానా చెప్పిన విశేషాలు... 

దుల్కర్‌ మాట్లాడుతూ – ‘‘కాంత’ కథ విన్నప్పుడే, నేను–రానా కచ్చితంగా ఈ సినిమా చేయాలనుకున్నాం. దర్శకుడు సెల్వ చాలా రీసెర్చ్‌ చేసి, తెరకెక్కించారు. ఇది ఎవరి బయోపిక్‌ కాదు. పూర్తిగా కల్పిత కథ. ‘మహానటి’ సినిమాలో సినిమాల ప్రస్తావన ఉంటుంది. అలాగే ‘కాంత’లో ఫిల్మ్‌మేకింగ్‌ ప్రస్తావన ఉంది. ‘కాంత’లోని మహాదేవ పాత్రను నేను ఎలా చేయాలి? ఎలా చేయగలను? అని నేను, దర్శకుడు చర్చించుకునేవాళ్లం. 

→ తెలుగులో వరుసగా సక్సెస్‌ఫుల్‌ సినిమాలు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే రీసెంట్‌ టైమ్స్‌లో నా కెరీర్‌లో ఎక్కువగా పీరియాడికల్‌ చిత్రాలే ఉంటున్నాయి. బహుశా 2025 నాటి కథలను ఎంపిక చేసుకోవడంలో నేను స్ట్రగుల్‌ అవుతున్నానేమో (నవ్వుతూ).

రానా మాట్లాడుతూ – ‘‘కాంత’ సినిమా 1950 మద్రాస్‌ నేపథ్యంలో సాగే ఫిక్షనల్‌ స్టోరీ. ఎవరి తాత, నాన్నల కథ కాదు (నవ్వుతూ). ఇప్పుడు ఏ స్టూడియోలో ఏం జరిగినా వెంటనే అందరికీ తెలిసిపోతుంది. కానీ ఆ కాలంలో అలా కాదు. చాలా తక్కువమందికి తెలిసేది. ఆ కాలంలో జరిగిన కొన్ని సంఘటనల స్ఫూర్తితో ఈ సినిమా తీశాం. ‘డార్క్‌ సైడ్‌ ఆఫ్‌ గ్రేట్‌ పీపుల్‌’ అని చెప్పవచ్చు. ఇద్దరు గొప్ప ఆర్టిస్టులు (దుల్కర్, సముద్ర ఖని పాత్రలను ఉద్దేశించి) వాళ్ల ఆర్టిస్టిక్‌ బ్రిలియన్స్‌ కోసం గొడవలు పడిన నేపథ్యంలో ‘కాంత’ ఆసక్తిగా సాగుతుంది. 

→ ఒక ఫస్ట్‌ టైమ్‌ ఫిల్మ్‌మేకర్‌కు ఉండాల్సిన ΄్యాషన్‌ సెల్వలో కనిపించింది. దర్శకుడు సెల్వ ఈ సినిమా కోసం చాలా రీసెర్చ్‌ చేశారు. ఇక టెస్ట్‌ షూట్‌ సమయంలో భాగ్యశ్రీ మోడ్రన్‌ డ్రెస్‌లో వచ్చారు. అది చూసి, ‘కాంత’ సినిమాలో భాగ్య పాత్రకు ఆమె సెట్‌ అవుతారా? అనిపించింది. కానీ కుమారి పాత్రలో భాగ్య చక్కగా ఒదిగిపోయారు. 
→ సురేష్‌బాబుగారి ఇన్‌పుట్స్‌ ‘కాంత’ సినిమాలో ఉన్నాయి. ఎందుకంటే అప్పటి స్టూడియో కల్చర్‌ గురించి ఆయనకు బాగా తెలుసు. ‘పాతాళభైరవి’ సినిమా కోసం వినియోగించిన కెమెరాలు, మరికొన్ని పాత సినిమాల పరికరాలు ‘కాంత’లో కనిపిస్తాయి. కమర్షియల్‌ సినిమాలు తీయడం కాస్త సులువు. కానీ ‘కాంత’లాంటి సినిమాలు చేయడం పెద్ద చాలెంజ్‌.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement