Pushpa Movie Song: 'పుష్ప' మూవీ నుంచి థర్డ్‌ సింగిల్‌ రిలీజ్‌ 

Pushpa Movie: Third Single Nuvvu Ammi Ammi Antunte Song Released - Sakshi

Pushpa Movie Third Song Released: క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌, ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప’. రష్మిక మందన్నా ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే 'పుష్ప' నుంచి విడుదలైన.. దాక్కో దక్కో మేక', ‘చూపే బంగారమయ్యేనే శ్రీ వల్లి.. మాటే మాణిక్యమాయేనే’ పాటలు యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి థర్డ్‌ సింగిల్‌ సామీ సామీ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు.

‘నువ్వు అమ్మి అమ్మి అంటాంటే… నీ పెళ్లాన్నే అయిపోయినట్టుంది రా సామీ.. నిను సామీ సామీ అంటాంటే నా పెనిమిటి లెక్క సక్కంగుందిరా సామీ’ అంటూ సాగే ఈ సాంగ్‌ ఆకట్టుకుంటుంది. కాగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ మూవీని రెండు పార్ట్స్‌గా విడుదల చేస్తుండగా.. మొదటి భాగం డిసెంబర్‌ 17న విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top