
కాంతార ఛాప్టర్ 1(Kantra chapter 1)తో రిషబ్ శెట్టి భారీ విజయాన్ని అందుకున్నారు. అక్టోబర్ 2న విడుదలైన ఈ మూవీపై పాన్ ఇండియా రేంజ్‌లో పాజిటివ్ రివ్యూలే వినిపిస్తున్నాయి. కాంతార చిత్ర యూనిట్‌పై ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ రియాక్ట్ అయ్యారు. తాజాగా ప్రభాస్(Prabhas ), సందీప్‌రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) స్పందించారు. వారు సినిమాపై ప్రశంసలు కురిపించారు. బుక్‌మైషోలో కాంతార టికెట్ల సేల్ భారీగానే ఉంది. పీక్ టైమ్‌లో ప్రతి గంటకు సుమారు 60వేల టికెట్లు అమ్ముడుపోతున్నాయి. 24గంటలకు ఏకంగా 5లక్షలకు పైగానే టికెట్లు అమ్ముడుపోతున్నాయి.
దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా కాంతార చాప్టర్1పై ఇలా చెప్పారు. 'కాంతార చాప్టర్ 1 నిజమైన మాస్టర్ పీస్. ఇండియన్ సినిమా ఇంతకు ముందు ఇలాంటి చిత్రాన్ని ఎప్పుడూ చూడలేదు. ఇది ఒక సినిమాటిక్ ప్రభంజనం. స్వచ్ఛమైన భక్తి ఎలా ఉంటుందో ఇందులో చూపించారు. దీనిని ఎవరూ దాటలేరు. ఈ చిత్రంలో రిషబ్ శెట్టి నిజమైన వన్-మ్యాన్ షో ప్రదర్శించారు. ఈ మూవీని ఒంటి చేత్తో రూపొందించడమే కాకుండా ముందుకు తీసుకెళ్లాడు. కాంతార బీజీఎమ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం చాలా బాగుంది.' అని ఆయన మెచ్చుకున్నారు.
కాంతార ఛాప్టర్ 1 మూవీ విడుదలైన కొన్ని గంటల్లోనే ప్రభాస్ ఇలా పోస్ట్ చేశారు. 'కాంతార ఛాప్టర్ 1 బ్రిలియంట్ మూవీ. ఇందులో నటించిన వారందరి ప్రతిభ చాలా బాగుంది. ఈ ఏడాది అతిపెద్ద విజయంగా కాంతార1 నిలుస్తుంది. ఈ సినిమాకు ప్రధాన బలయం రిషబ్ శెట్టి నటన. ఆపై హోంబలే ఫిల్మ్స్ విజయ్ కిరగండూర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ విజయం సాధించిన చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు.' అని ప్రభాస్ తన స్టోరీలో రాశాడు.