
వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj), సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం అరి. 'మై నేమ్ ఈజ్ నో బడీ' అనేది ఉపశీర్షిక. "పేపర్ బాయ్" చిత్రంతో ప్రతిభావంతమైన దర్శకుడుగా పేరు తెచ్చుకున్న జయశంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఆర్‌వీ సినిమాస్ పతాకంపై రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి (ఆర్‌వీ రెడ్డి) సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, డి.శేషురెడ్డి మారంరెడ్డి, నాయుడు నిర్మిస్తున్నారు.
అరి రిలీజ్ ఎప్పుడంటే?
లింగ గుబపనేని కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. విజయదశమి సందర్భంగా ‘అరి’ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. ఏషియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ నెల 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు ఒక మంచి మెసేజ్‌తో ‘అరి’ సినిమా రూపొందించినట్లు తెలుస్తోంది.