Prabhas Clarity About Clashes With Pooja Hegde in Radhe Shyam - Sakshi
Sakshi News home page

Prabhas : 'అందుకే పూజాను తీసుకున్నాం.. ఆమెతో కెమిస్ట్రీ బాగా సెట్‌ అయ్యింది'

Mar 5 2022 5:23 PM | Updated on Mar 5 2022 6:35 PM

Prabhas About Pooja Hegde Role  In Radhe Shyam - Sakshi

ప్రభాస్‌, పూజా హెగ్డే కలిసి నటించిన చిత్రం 'రాధేశ్యామ్‌' విడుదలకు సిద్ధం అవుతుంది. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయంటూ వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు ప్రమోషన్స్‌లోనూ ఈ గ్యాప్‌ స్పష్టంగా కనిపించింది. ఎడమొహం, పెడమొహం అన్నట్లు పక్కపక్కనే ఉన్నా మాట్లాడుకోకపోవడంతో ఈ రూమర్స్‌కి మరింత బలం చేకూరింది. అయితే తాజాగా ప్రభాస్‌ ఈ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చారు.

తమిళనాడులో నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఉత్సాహంగా పాల్గొని మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ చిత్రంలో హీరోయిన్‌ పాత్ర కీలకమని, అందుకే ప్రేరణ పాత్ర కోసం ఎంతగానో ఆలోచించి పూజాన తీసుకున్నట్లు తెలిపారు. ఇక ఈ సినిమాలో ఆమెతో కెమిస్ట్రీ బాగా సెటయ్యిందని చెప్పారు.

అంతకుముందు పూజా హెగ్డే ప్రభాస్‌ గురించి మాట్లాడుతూ.. ఆయనకు సిగ్గు ఎక్కువని, అందుకే ఆయనతో కలవడానికి టైం పడుతుందని కానీ ఒకసారి కలిసిపోతే మాత్రం ఆయనంత స్వీట్‌ పర్సన్‌ మరొకరు లేదని తెలిపింది. దీన్ని బట్టి ఇద్దరి మధ్యా విభేదాలు అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టమవుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement