Paruchuri Gopala Krishna: వాల్తేరు వీరయ్యలో రామ్‌ చరణ్‌ ఆ పాత్ర చేసి ఉంటే..: పరుచూరి

Paruchuri Gopala Krishna Review On Megastar Waltair Veerayya Movie - Sakshi

ప్రముఖ lతెలుగు సినీ రచయిత  పరుచూరి గోపాలకృష్ణ తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. కొత్త సినిమాలపై ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటారు. తాజాగా మెగాస్టార్ బ్లాక్ బస్టర్ మూవీ వాల్తేరు వీరయ్య సినిమాపై  పరుచూరి గోపాలకృష్ణ తన రివ్యూను వెల్లడించారు. 

పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. 'వాల్తేరు వీరయ్య చాలా సింపుల్ స్టోరీ. కానీ రవితేజ బదులు రామ్ చరణ్ చేసి ఉంటే చిరంజీవికి మైనస్ మార్కులు పడేవి. ఎందుకంటే తమ్ముడి పాత్రలో రవితేజ పాత్ర చూశాక.. చరణ్‌ చేస్తే బాగుండదనే నిర్ణయానికి వచ్చా. అందుకే రవితేజను పెట్టారు.  ఆయన అద్భుతంగా నటించారు. ఆయన బాడీ లాంగ్వేజ్ ప్రత్యేకం. పైగా ఒక ఫిషర్‌ మ్యాన్‌కు జోడిగా శృతిహాసన్ తీసుకొచ్చి పెట్టారు. ఇక్కడ చిరంజీవి సినిమా మెగా ఆడియన్స్‌ను దృష్టిలో ఉంచుకుని తీశారు. చిరంజీవి, రవితేజ.. హీరోయిన్స్‌తో ప్రేమాయణం లాంటివి కథలో చూపిస్తే సినిమా హిట్ అయ్యేది కాదు.' అని అన్నారు. 

(ఇది చదవండి: ఓటీటీకి వచ్చేసిన ‘వాల్తేరు వీరయ్య’, అర్థరాత్రి నుంచే స్ట్రీమింగ్‌, ఎక్కడో తెలుసా?)

చిరంజీవి నటనపై పరుచూరి మాట్లాడూతూ..' తనకు వర్టిగో వ్యాధి ఉందని చెప్పే సన్నివేశాల్లో చిరంజీవి నటన అద్భుతంగా ఉంది. మనకు తెలియకుండా ఆ వ్యాధితో ఏమైపోతాడోననే భయాన్ని ఆసాంతం ప్రేక్షకుల్లో కలిగించాడు దర్శకుడు. సంభాషణలు, పొడి పొడి మాటలు బాగున్నాయి. ఊహకందని ట్విస్టులు సినిమాపై మరింత ఆసక్తి పెంచాయి. మలేషియాకు వెళ్లినప్పుడు బంపర్ ట్విస్ట్ ఇచ్చారు. మలేషియా నుంచి ఓ కాంట్రాక్ట్ తీసుకుని వచ్చిందే కథ. ఇందుకు కథ రచయిత బాబీని మెచ్చుకోవాలి. అప్పట్లో చిరంజీవి బాడీ లాంగ్వేజ్‌ ఎలా ఉందో.. ఇ‍ప్పుడు‌ అలాగే కనిపించారు. ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్‌, కేథరిన్‌ బాగా నటించారు. వారి పాత్రలూ సినిమా విజయంలో స్థానం దక్కించుకున్నాయని' అని అన్నారు. మెగా ఫ్యాన్స్‌కు అద్భుతమైన అనుభూతిని అందించిన చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. పూనకాలు లోడింగ్' అనే పదం కేవలం అభిమానుల కోసమే పెట్టారని వెల్లడించారు. 

కాగా.. మెగాస్టార్ చిరంజీవి, శృతిహాసన్ జంటగా నటించిన చిత్రం‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. బాబీ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కేవలం మూడు రోజుల్లోనే వాల్తేరు వీరయ్య వందకోట్లు కలెక్ట్‌ చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. మాస్ మహారాజా రవితేజ కీలకపాత్ర పోషించిన ఈ చిత్రంలో శృతి హాసన్‌ హీరోయిన్‌గా నటించింది. 
 

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top