
హారర్ సినిమాలకు క్రేజ్ ఎప్పుడూ ఉండేదే! తాజాగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ హారర్ వెబ్ సిరీస్‌ను ప్రకటించింది. అదే "అంధేరా" (Andhera). ఈ వెబ్ సిరీస్‌ను ఆగస్టు 14 నుంచి అందుబాటులోకి తేనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. అంధేరా విషయానికి వస్తే.. ప్రియా బాపత్, కరణ్‌వీర్ మల్హోత్రా, ప్రజక్త కోలి, సుర్వీన్ చావ్లా ప్రధాన పాత్రల్లో నటించారు. గౌరవ్ దేశాయ్ కథ అందించగా రాఘవ్ దర్ దర్శకత్వం వహించాడు. ఇది ఎనిమిది ఎపిసోడ్లుగా ప్రసారం కానుంది.
Brace yourself, this Andhera doesn’t just haunt, it hunts 🫣#AndheraOnPrime, New Series, Aug 14 pic.twitter.com/vg5IAB3TgX
— prime video IN (@PrimeVideoIN) August 6, 2025
చదవండి: 'గుడిసెలో జీవితం.. ఇంట్లోకి పాములు..' సూర్య ఎమోషనల్