Odia Serial Actor M Suman Kumar: గర్ల్‌ఫ్రెండ్‌ ఫిర్యాదుతో సీరియల్ నటుడి అరెస్ట్‌.. ఎందుకంటే ?

Odia Serial Actor M Suman Kumar Arrested For Cheating Girlfriend Case - Sakshi

Odia Serial Actor M Suman Kumar Arrested For Cheating Girlfriend Case: సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులకు గురైన హీరోయిన్లు చాలానే ఉన్నారు. ఇటీవల కాలంలో వారు ఒక్కొక్కరిగా వారికి జరిగిన అన్యాయాలను బయటపెడుతున్నారు. అలాగే లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న పెద్ద పెద్ద మేల్‌ సెలబ్రిటీలు కూడా లేకపోలేదు. తాజాగా ఒక టీవీ సీరియల్‌ నటుడు ప్రేమ, పెళ్లి పేరు చెప్పి శారీరకంగా లొంగదీసుకుని, మోసం చేశాడనే ఆరోపణలతో అరెస్ట్‌ అయ్యాడు. ఒడియా టీవీ సీరియల్లో నటించే ఎం సుమన్‌ కుమార్‌ను భువనేశ‍్వర్‌లోని పహాలా పోలీసులు ఆదివారం (ఏప్రిల్‌ 24) అరెస్ట్ చేశారు. 

ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి ఓ అమ్మాయిని మోసం చేశాడనే ఆరోపణలతో సుమన్‌ కుమార్‌పై కేసు నమోదు అయింది. నటుడు ఎం సుమన్‌ గత రెండేళ్లుగా అమ్మాయితో సంబంధం కొనసాగిస్తున్నట్లు బాధితురాలి తరఫు న్యాయవాది ప్రశాంత్‌ దే తెలిపారు. ఆమెను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి అమ్మాయితో సాన్నిహిత్యం పెంచుకున్నాడన్నారు. తీరా పెళ్లి ప్రస్తావన తీసుకొస్తే ముఖం చాటేశాడని ఆయన పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా సుమన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిపై ఐపీసీ సెక్షన్‌ 376 (2) (ఎన్‌), 420, 294, 323, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. 

చదవండి: ఆ నటుడికి 61 ఏళ్లు.. రెండేళ్ల వివాహ బంధానికి విడాకులు..

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top